
ఇటీవల కాలంలో పర్సనల్ లోన్లకు డిమాండ్ పెరుగుతోంది. చిరుద్యోగుల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకూ అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా లభిస్తుండటం.. అత్యవసర సమయాల్లో సులభంగా క్షణాల్లో మనకు లభిస్తుండటం, అలాగే సులభంగా తిరిగి చెల్లించే విధానాలు అందుబాటులో ఉండటంతో అందరూ వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మినీ లోన్లు అంటే తక్కువ మొత్తాలను లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రోజువారీ జీవన విధానంలో అత్యవసర ఖర్చులు కొన్ని ఉంటాయి. ఆసమయంలో మన వద్ద డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మరొకరిపై ఆధారపడకుండా త్వరిగతిన మన అవసరాలను ఈ మినీ లోన్లు తీర్చుతున్నాయి. అయితే అవి తీసుకొనే ముందు కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు పర్సనల్ లోన్ కు దరఖాస్తు చేసుకునే ముందు అవి అసలు ఎలా పనిచేస్తాయి.. వాటి ప్రయోజనాలు ఏమిటి? నష్టాలు ఏమిటి తెలుసుకుందాం రండి..
మినీ లోన్ అంటే..?
మినీ లోన్ లేదా చిన్న వ్యక్తిగత రుణం అనేది స్వల్పకాలిక రుణం. ఇది మీ అత్యవసర ఖర్చులను భరించటానికి సహాయపడుతుంది. ఇది అన్‌సెక్యూర్డ్.. అంటే మీరు ఎటువంటి భద్రత లేదా పూచీకత్తు అందించాల్సిన అవసరం లేదు. ఈ రుణాలు దరఖాస్తు చేసుకోవడం సులభం. కనీస కాగితపు పనితో త్వరగా మంజూరు అవుతాయి. ఈ మినీ లోన్ ను మీరు దేనికైనా వినియోగించుకోవచ్చు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి మరమ్మతులు, ప్రయాణం లేదా ఉపకరణాల కొనుగోలు వంటి మీకు అవసరమైన దేనికైనా దీనిని ఉపయోగించవచ్చు. తిరిగి చెల్లించడం కూడా సులభం. మీకు సరిపోయే కాలపరిమితిని మీరు ఎంచుకోవచ్చు. సాధారణంగా 12 నుంచి 72 నెలల మధ్య ఉంటుంది. మీరు సాధారణంగా రూ. 5,000 నుంచి కొన్ని లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.
మినీ లోన్ అర్హత ప్రమాణాలు
జీతం పొందే ఉద్యోగులు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకుందుకు అర్హులే. ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగాలు లేదా బహుళజాతి సంస్థలలో పనిచేసే వ్యక్తులు ఎవరైనా చేసుకోవచ్చు. వీరి వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కనీస నెలవారీ జీతం రూ. 15,000 నుంచి రూ. 30,000 వరకు ఉండాలి. కనీసం 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం, ప్రస్తుత ఉద్యోగంలో 1 సంవత్సరం పనిచేసి ఉండాలి. అలాగే స్వయం ఉపాధి నిపుణులు అంటే వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కన్సల్టెంట్లు, వ్యాపార యజమానులు మొదలైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి వయసు 23 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. కనీస వార్షిక టర్నోవర్ రూ. 15 లక్షలు ఉండాలి. అదే వ్యాపార యజమానులు (ప్రొఫెషనల్స్ కానివారు) అయితే కనీస వార్షిక టర్నోవర్ రూ. 40 లక్షలు చూపించాల్సి ఉంటుంది. వ్యాపారంలో కనీసం 5 సంవత్సరాలు అనుభవం ఉండాలి. వీరితో పాటు స్వయం ఉపాధి పొందుతున్న నిపుణులు, యాజమాన్య సంస్థలకు సంవత్సరానికి రూ. 2 లక్షలు, నిపుణులు కాని వారికి రూ. 1 లక్ష ఆదాయం ఉండాలి. మిని లోన్ సులభంగా మంజూరు కావాలంటే ప్రధానంగా క్రెడిట్ స్కోర్ అధికంగా ఉండాలి. సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే లోన్ మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది వడ్డీ రేట్లను తగ్గిస్తుంది.
దరఖాస్తు ఇలా..
చిన్న వ్యక్తిగత రుణాలను అందించే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ లో సంప్రదించడం ద్వారా వీటిని పొందొచ్చు. అందుకోసం ప్రధానంగా మీరు అర్హత పొందారో లేదో చూడటానికి మీ వయస్సు, ఆదాయం, ఉద్యోగ రకం (జీతం/స్వయం ఉపాధి), రుణ మొత్తం వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కొంతమంది రుణదాతలు తక్షణ అర్హత కాలిక్యులేటర్‌ను కూడా అందిస్తారు. ఆ తర్వాత మీ వ్యక్తిగత, ఉద్యోగ, ఆర్థిక వివరాలను అందించాలి. తర్వాత మీకు సరిపోయే రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ కేవైసీ పత్రాల స్కాన్ చేసిన కాపీలు లేదా ఫోటోలు, ఆదాయ రుజువు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఏవైనా ఇతర పత్రాలు సంస్థ అడిగితే సమర్పించండి. చాలా మంది రుణదాతలు కాగిత రహిత ప్రక్రియను అందిస్తారు. బ్యాంక్ మీ దరఖాస్తును సమీక్షించి, మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తనిఖీ చేస్తుంది. ఈ ప్రక్రియ సాధారణంగా వేగంగా ఉంటుంది. కొంతమంది రుణదాతలు తక్షణ ఆమోదాన్ని అందిస్తారు.
మినీ లోన్ ప్రయోజనాలు..
- మినీలోన్ పొందడానికి మీరు ఎటువంటి భద్రత లేదా ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది అసురక్షిత, రిస్క్-రహిత రుణ ఎంపికగా మారుతుంది.
- మీరు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే చాలా మినీ లోన్‌లు తక్షణమే మంజూరవుతాయి . కొంతమంది రుణదాతలు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ముందస్తు అనుమతి పొందిన రుణాలను కూడా అందిస్తారు.
- మంజూరైన తర్వాత, లోన్ మొత్తం కొన్ని గంటల్లో మీ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. మీకు అత్యంత అవసరమైనప్పుడు ఇది మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది
- ఈ లోన్ డబ్బును దేనికైనా ఉపయోగించుకోవచ్చు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి మరమ్మతులు, వివాహ ఖర్చులు, ప్రయాణం, విద్య లేదా షాపింగ్ వంటి వాటికి కూడా వాడుకోవచ్చు.
- రుణ ప్రక్రియ కాగితం రహితంగా ఉంటుంది. అందువల్ల ఇబ్బంది ఉండదు. ఈ లోన్కు సాధారణంగా ఐడీ, ఆదాయ రుజువు, బ్యాంక్ స్టేట్ మెంట్ వంటివి మాత్రమే అవసరం అవుతాయి.
సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. సాధారణంగా 12 నుంచి 72 నెలల మధ్య తిరిగి చెల్లించే కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం ఎంచుకుంటే మీ ఈఎంఐ భారాన్ని తగ్గిస్తుంది. అయితే తక్కువ కాలవ్యవధి వడ్డీని ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. - క్రెడిట్ కార్డు లోన్లతో పోలిస్తే వడ్డీ రేట్లు దీనిలో తక్కువగా ఉంటాయి. సంవత్సరానికి 10.5% నుంచి ప్రారంభమవుతాయి.
- చిన్న వ్యక్తిగత రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం వల్ల మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి