ABN
, Publish Date – Mar 19 , 2025 | 11:12 AM
KTR Blasts Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Former Minister KTR
హైదరాబాద్, మార్చి 19: రుణమాఫీ కాక, రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (BRS MLA KTR) అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ నదిలో నీళ్ళు సక్రమంగా వాడుకోలేక పంటలు ఎండబెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించేందుకు ఎండిపోయిన వరితో నిరసన తెలుపుతున్నామన్నారు. సకాలంలో వర్షాలు పడ్డాయని.. కానీ ప్రాజెక్టుల్లో నీళ్లు నింపలేదని విమర్శించారు. మేడిగడ్డ ఎండబెట్టి సిగ్గులేకుండా ఇసుక అమ్మకాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. 36 శాతం కృష్ణ జాలలు వాడుకోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు.
కిందకి నీళ్లు వదిలి చంద్రబాబు మీద ప్రేమతో ఇక్కడ పంటలు ఎండబెట్టారని ఆరోపించారు. వరి చెళ్ళలో మేకలు గొర్రెలు మేస్తున్నాయన్నారు. దేవాదుల పంపులు ఆరు కోట్లు ఇస్తే నీళ్ళు వదిలే అవకాశం ఉండేదన్నారు. కానీ అందులో కమిషన్ రాదు కాబట్టి అవి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని వ్యాఖ్యలు చేశారు. కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విమర్శలు గుప్పించారు. ఎక్కడెక్కడ లక్షల పంటలు ఎండిపోయాయో ఆ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులు నింపలేని తెలివి తక్కువతనం, పాడైన బ్యారేజ్ రిపేర్ చేయకుండా తెలివి తక్కువతనంతో ప్రభుత్వం సిగ్గులేని చర్యలకు పాల్పడుతోందన్నారు. పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో తాము పర్యటిస్తామన్నారు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి…
KTR Criticizes Congress: ఇచ్చిన తేదీ దాటిపాయే… సన్నాలు ఏవీ సారూ
Big Shock To YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. మరో నేత జంప్
Read Latest Telangana News And Telugu News
Updated Date – Mar 19 , 2025 | 12:22 PM