
నవతెలంగాణ – డిచ్ పల్లి
పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామ పంచాయతీ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్ మాట్లాడుతూ జిల్లాలలో గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్, డిపిఓ, మండలాల అభివృద్ధి అధికారులకు విజ్ఞప్తి చేయుచున్నట్లు వివరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ పంచాయతీ కార్మికులకు ఎటువంటి జీతాలు పెరగలేదని, ఈఎస్ఐ, ఫ్రీ ఆఫ్ పర్మినెంట్ జీవిత బీమా, బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె తదితర విషయాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాట్లు పేర్కొన్నారు.
విలిన సభా ను విజయవంతం చేయాలి…
తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అనుబంధం ఐ ఎఫ్ టి యు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ టియు యూనియన్ లో విలీనం ఈనెల 27న డిచ్ పల్లి మండల కేంద్రంలోని గన్ పూర్ గ్రామంలోని గ్రామ కళ్యాణ మండపంలో విలీన సభ ఉంటుందని వివరించారు.ఈ విలిన సభకు అధ్యక్షులుగా కామ్రేడ్ ఎం దాసన్న, ఐ ఎఫ్ టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపన్న పాల్గొంటారని ఈ రెండు విలీన సభను జిల్లాలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కరపత్రం ఆవిష్కరణలో మెంట్రాజ్ పల్లి గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ షేక్ అసిఫోద్దిన్,సాయిలు, పాండు, కవి సాయిలు, దావీదు, సంఘం సాయన్న తదితరులు పాల్గొన్నారు.