- చాహల్ ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు..
- రూ. 4.75 కోట్లు భరణం చెల్లించనున్న చాహల్..

Chahal – Dhanashree: స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు కొలిక్కి వచ్చాయి. రేపటిలోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం, విడాకుల తర్వాత 6 నెలల కూలింగ్ పీరియడ్‌ను వదులుకోవడానికి ఈ జంటకు అనుమతి ఇచ్చింది. కూలింగ్ పీరియడ్‌ని వదులుకోవాలన్న పిటిషన్‌ని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఈ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున పాల్గొనేందుకు, చాహల్-ధనశ్రీల విడాకుల పిటిషన్‌ని మార్చి 20 లోగా నిర్ణయించాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది.
Read Also: Elon Musk: జో బిడెన్ వ్యోమగాములను భూమిపైకి తీసుకురానివ్వలేదు?.. కారణం చెప్పిన మస్క్..
ఈ జంట 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. జూన్ 2022 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ జంట కూలింగ్ పీరియడ్‌ను వదులుకోవాలని పిటిషన్‌తో పాటు ఒక దరఖాస్తును కూడా దాఖలు చేశారు. సెక్షన్ 13B(2) ప్రకారం, కుటుంబ కోర్టు పరస్పర విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత మాత్రమే పరిగణించగలదు. సెటిల్మెంట్, మళ్లీ కలిసి ఉండే అవకాశాలు పరిశీలించడానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వబడుతుంది. చాహల్, ధనశ్రీ రెండేళ్లుగా దూరంగా నివసిస్తుండటంతో ఈ కేసులో కూలింగ్ ఆఫ్ పీరియడ్ వర్తించదని బాంబే హైకోర్టు భావించింది.
చాహల్ తన విడిపోయిన భార్య ధనశ్రీకి శాశ్వత భరణం కింద రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, చాహల్ ఇప్పటి వరకు రూ. 2 కోట్ల 37 లక్షల 55 వేలు మాత్రమే చెల్లించినట్లు చెబుతున్నారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడాన్ని కోర్టు నిబంధనల్ని పాటించకపోవడంగా పరిగణించింది. అందువల్ల కూలింగ్ ఆఫ్ పిటిషన్ తిరస్కరించారు. బుధవారం, బాంబే హైకోర్టు ఈ జంట ఇప్పటికే రెండున్నర సంవత్సరాలకు పైగా విడివిడిగా గడిపారని పేర్కొంది, మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి వీలుగా సమ్మతి నిబంధనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. రాబోయే ఐపీఎల్ సీజన్ కారణంగా గురువారం (మార్చి 20) నాటికి విడాకుల పిటిషన్‌ను నిర్ణయించాలని కుటుంబ కోర్టును కోరారు.