GHMC Standing Committee meeting tomorrow afternoon

Written by RAJU

Published on:

  • రేపు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
  • జీహెచ్ఎంసీ మేయర్, కమీషనర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం
  • కమిటీ సభ్యులు మొత్తం 16 అంశాలపై చర్చించనున్నారు
GHMC Standing Committee meeting tomorrow afternoon

హైదరాబాద్ లో రేపు(మార్చి 20) మధ్యాహ్నం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. జీహెచ్ఎంసీ మేయర్, కమీషనర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. కొత్తగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి స్టాండింగ్ కమిటీలో ఎనిమిది మంది MIM, ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో ప్రాతినిధ్యం లేని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు.

Also Read:Hyderabad: పసి పిల్లలను అమ్ముతున్నారు జాగ్రత్త.. ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు..

ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మొత్తం 16 అంశాలపై చర్చించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నది స్టాండింగ్ కమిటీ. అల్వాల్ లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ NOC ఇవ్వనున్నది. నల్లగండ్ల చెరువులోకి వచ్చే మురుగునీటినీ మళ్లించడానికి 3 కోట్ల 35 లక్షల కేటాయింపుకు కమిటీ ఆమోదం తెలపనున్నది.

Subscribe for notification