IPL match schedule to be held on April 6 changed

Written by RAJU

Published on:


  • ఏప్రిల్ 6న జరిగే ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు
  • కోల్‌క‌తా నైట్ రైడర్స్‌, ల‌క్నో సూప‌ర్ గెయింట్స్ మ‌ధ్య ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జ‌ర‌గాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ ను రీషెడ్యూల్ చేసేఅవ‌కాశం
  • ఏప్రిల్ 6న శ్రీరామ నవమి కావడంతో
IPL match schedule to be held on April 6 changed

ఐపీఎల్ 2025 కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ సంగ్రామం ప్రారంభంకాబోతోంది. తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యన జరుగనున్నది. ఇదిలా ఉంటే.. కోల్‌క‌తా నైట్ రైడర్స్‌, ల‌క్నో సూప‌ర్ గెయింట్స్ మ‌ధ్య ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జ‌ర‌గాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ ను రీషెడ్యూల్ చేసే అవ‌కాశం ఉంది. మ్యాచ్ నిర్వహనకు బెంగాల్ పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో షెడ్యూల్ లో మార్పు చేయనున్నారు.

Also Read:Satya Kumar Yadav: గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది.. ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం!

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి కావడంతో… బెంగాల్‌లో సుమారు 20 వేల చోట్ల భారీగా ర్యాలీలు తీసేందుకు బీజేపీ నేత సువేందు అధికారి ప్లాన్ చేస్తున్నారు. దీంతో భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో స్టేడియం వద్ద సెక్యూరిటీ కల్పించలేం అని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేసుకోవాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కు పోలీసులు లేఖ రాశారు.

Also Read:US: టెస్లా షోరూమ్‌కి నిప్పు.. కార్లు దగ్ధం, ఉగ్ర చర్యగా మస్క్ ఆరోపణ

దీనిపై బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ స్నేహ‌శిశ్ గంగూలీ స్పందించారు. ఇప్పటికే సిటీ పోలీసుల‌తో రెండు సార్లు చ‌ర్చలు జ‌రిపామని చెప్పారు. అధికారులు మ్యాచ్ ఏర్పాటుకు ప‌ర్మిష‌న్ ఇవ్వడం కుదరదు అన్నారు. భ‌ద్రతను క‌ల్పించ‌లేమ‌ని పోలీసులు చెబుతున్నారు. పోలీసు ప్రొటెక్షన్ లేకుండా 65వేల మంది ప్రేక్షకులను కంట్రోల్ చేయ‌డం క‌ష్టం అవుతుందన్నారు. మ్యాచ్ తేదీపై తుది నిర్ణయం తీసుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంది. ఈ విష‌యాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాం అని తెలిపారు.

Subscribe for notification