- రన్యా రావుపై అవమానకరమైన వ్యాఖ్యలు
- బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
- బీజేపీ ఎమ్మెల్యేపై బిఎన్‌ఎస్ సెక్షన్ 79 కింద కేసు నమోదు

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ పై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నటి రన్యా రావు తరపున ఆకుల అనురాధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో నటిపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి యత్నాల్ పరువు నష్టం కలిగించారని ఆరోపించారు. పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేపై బిఎన్‌ఎస్ సెక్షన్ 79 కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాల్, బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
Also Read:Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
నటి ప్రైవేట్ పార్ట్స్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రన్యారావు ఏఏ పార్టుల్లో బంగారం దాచిందో తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ఈ బంగారం అక్రమ రవాణా కేసులో కర్ణాటకకు చెందిన కొంతమంది మంత్రులు కూడా ఉన్నారని యత్నాల్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆ మంత్రులందరి పేర్లను వెల్లడిస్తానని ఆయన అన్నారు. బంగారం అక్రమ రవాణా కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read:Betting Apps Case: తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోన్న బెట్టింగ్ యాప్స్.. వణికిపోతోన్న సెలబ్రిటీలు..!
రన్యా రావును మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో 14.2 కిలోల బంగారంతో అధికారులు అరెస్టు చేశారు. ఈ బంగారం విలువ రూ.12.56 కోట్లుగా అంచనా వేశారు. రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), ఇతర ఏజెన్సీల దర్యాప్తులో రన్యా ఈ సంవత్సరం ఇప్పటివరకు 27 సార్లు దుబాయ్‌ని సందర్శించిందని, ప్రతిసారీ పెద్ద మొత్తంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందని తేలింది.