
ఫ్రిజ్‌ను తరచుగా శుభ్రం చేయకపోతే దుర్వాసన వెదజల్లడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి సులభమైన, చక్కని పరిష్కారం ఉంది. కేవలం మూడు పదార్థాలతో మీ ఫ్రిజ్‌ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. మీరు ఫ్రిజ్ శుభ్రం చేయడానికి డిష్ వాషింగ్ లిక్విడ్, ఒక కప్పు నీరు, ¼ కప్పు వైట్ వెనిగర్ అవసరం. ఇవి మీకు ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా రసాయన రహితంగా శుభ్రం చేయడానికి ఇవి బాగా సహాయపడతాయి.
ముందుగా ఒక చిన్న గిన్నెలో కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి దానిలో ఒక కప్పు నీరు జోడించాలి. ఆ తర్వాత ¼ కప్పు వైట్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్ప్రే బాటిల్‌లోకి పోసుకోవాలి. ఈ శుభ్రపరిచే ద్రావణం రసాయనాలు లేనిది, ఆరోగ్యానికి హానికరం కానిది కాబట్టి మీ ఫ్రిజ్‌ను ఎలాంటి భయం లేకుండా శుభ్రం చేసుకోవచ్చు.
ఫ్రిజ్‌ను శుభ్రం చేయడానికి ముందుగా ఫ్రిజ్‌లోని అన్ని ఆహారాన్ని బయటకు తీసేయాలి. ఫ్రిజ్ పూర్తిగా ఖాళీ అయిన తర్వాత తయారు చేసుకున్న ద్రావణాన్ని ఫ్రిజ్ లోని అన్ని భాగాల మీద పిచికారి చేయాలి. షెల్ఫ్‌లు, డోర్ లైనింగ్ సహా అన్ని ప్రాంతాల్లో స్ప్రే చేయడం ముఖ్యం.
ద్రావణం పిచికారి చేసిన తర్వాత శుభ్రమైన బట్టతో లేదా స్పాంజ్‌తో మురికిని మెల్లగా తుడవాలి. ప్రత్యేకంగా మూలల్లో పేరుకుపోయిన మురికిని కూడా శుభ్రం చేయాలి. ఫ్రిజ్ లో ఉన్న మురికిని అంతా కూడా ఇలా సులభంగా తుడిచేయవచ్చు.
ఫ్రిజ్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత దానిని కొద్ది నిమిషాల పాటు ఖాళీగా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన పోవడమే కాకుండా ఫ్రిజ్ లోపల చల్లని గాలి తగులుతుంది. ఆ తర్వాత మీ ఆహార పదార్థాలను తిరిగి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.
ఇలా కేవలం మూడు సులభమైన పదార్థాలతో మీ ఫ్రిజ్‌ను తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. రసాయనాలు వాడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయడం చాలా మంచిది.