
నవతెలంగాణ – పెద్దవంగర
పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని పోచారం, చిన్నవంగర, పెద్దవంగర గ్రామాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను మంగళవారం ఆమె పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలే పట్టుకొమ్మలని ఆపదలో వారిని అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలేరు కరుణాకర్ తదితరులు ఉన్నారు .