- సుప్రీంకోర్టులో నేడు ఆర్జీ కర్ కేసుపై విచారణ
- బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
- ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారిస్తుంది

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 17న ఈ కేసును సుమోటోగా విచారిస్తుంది. గత సంవత్సరం కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే.
Also Read:IPL 2025: కేకేఆర్‌కు భారీ షాక్.. భారత స్పీడ్‌స్టర్ ఔట్!
ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, వైద్య కళాశాలలు దారుణమైన అత్యాచారం, హత్య కేసుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నాయి. సుప్రీంకోర్టులో అప్పీల్ తర్వాత తిరిగి విధుల్లోకి చేరిన వైద్యులు, వైద్య నిపుణులను శిక్షించవద్దని గత విచారణలో ప్రధాన న్యాయమూర్తి ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. కేసులో ఏకైక నిందితుడు సంజయ్ రాయ్ కు కోల్‌కతా ప్రత్యేక కోర్టు జనవరి 20న శిక్ష విధించింది. ఆర్జీ కర్ అత్యాచారం-హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు పశ్చిమ బెంగాల్ లోని సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. 50,000 జరిమానా కూడా కోర్టు విధించింది.