ప్రశ్నోత్తరాలు..
శాసనసభ, శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ జీవోలను అందుబాటులో ఉంచడం, సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీల పెంపు, హెచ్‌ఎండీఏ భూముల తాకట్టు, విదేశీ విద్యానిధి పథకం తదితర అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం ఇవ్వనున్నారు. మండలిలో కూడా కీలక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సీతారామ ప్రాజెక్టు, ఫార్మాసిటీ, కల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పనుంది.