ABN
, Publish Date – Mar 17 , 2025 | 01:09 AM
సిరిసిల్లలో లక్ష లాది మంది కార్మికులు నివాసం ఉంటున్నారని, వారికి వైద్యం ని మిత్తం ఏర్పాటు చేస్తామన్న ఈ ఎస్ఐ హాస్పిటల్‌కు మోక్షం లభి స్తుందా లేదా అనే దానిపై కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సమా ధానం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు.

సిరిసిల్ల రూరల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్లలో లక్ష లాది మంది కార్మికులు నివాసం ఉంటున్నారని, వారికి వైద్యం ని మిత్తం ఏర్పాటు చేస్తామన్న ఈ ఎస్ఐ హాస్పిటల్‌కు మోక్షం లభి స్తుందా లేదా అనే దానిపై కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సమా ధానం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని పార్టీల నాయకులతో అఖి లపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి బీజేపీ విధానా లపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒత్తిడి తేవాలన్నా రు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమా వేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ సిరిసిల్లలో లక్షలాది మంది కార్మికులు నివాసం ఉంటున్నార ని, వారికి వైద్యం నిమిత్తం ఏర్పాటు చేస్తామన్న ఈఎస్ఐ హాస్పిటల్‌కు మోక్షం లభిస్తుందా లేదా అనే దానిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్ట డం తప్ప ప్రజల కష్టాలు ఆయనకు పట్టవన్నా రు. కరీంనగర్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి సిరి సిల్ల జిల్లా అభివృద్ధికి నయాపైసా ఖర్చు పెట్ట లేదన్నారు. ప్రజలు బండి సంజయ్‌కుమార్‌ను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా ప్రజలకు అమలు చేస్తామన్న హామీలను అమలు చేయ డంలేదన్నారు. ఈసారీ అసెంబ్లీలో జరిగే బడ్జెట్ లో కార్మికులు, సామాన్య ప్రజల కోసం నిధుల ను కేటాయించాలన్నారు. రైతురుణమాఫీ ఇంకా 10వేల కోట్లు ఇవ్వలేదన్నారు. రైతు భరోసా ఎక్క డా కూడా అమలు కాలేదన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు 2500, దళితులకు రూ12లక్షలు, అభయహస్తం అమలు కాలేదన్నారు. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకోలేద న్నారు. పెన్షన్ల ఉసే లేకుండా పోయిందని, రా ష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వలేద న్నారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపాదికన కేటాయింపులు చేస్తున్నామని ప్రకటించి వాటిని కాగితాలకే పరిమితవుతున్నా ఖర్చులు పెట్టడం లేదన్నారు. బీసీ, మైనార్టీలకు ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేక త వచ్చిందన్నారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాం గ్రెస్ పార్టీ అమలు చేయకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. కేంద్రంలో బడ్జెట్ లో తెలంగాణకు బీజేపీ పార్టీ అన్యా యం చేసిందన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400ఎక రాల భూములను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు.ప్రభుత్వ పాఠశాలలో 99శాతం నిరుపేద విద్యా ర్థులు చదువుతున్నారని వారికి సరైన కేటాయిం పులు లేవన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మూషం రమేష్, కార్యదర్శివర్గ సభ్యులు ఎగమం టి ఎల్లారెడ్డి, జివ్వాజి విమల, కోడం రమణ, మాల్లారపు అరుణ్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, ఎర్రవెల్లి నాగరాజు, ముక్తికాంత అశోక్, అన్నల్దాస్గణేష్, మాల్లారపు ప్రశాంత్, ఎలిగేటి రాజశేఖర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు గాంతుల మహేష్, రామంచ అశోక్, గుండెల్లి కళ్యాణ్‌కుమార్, రాజ మల్లు, రాపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date – Mar 17 , 2025 | 01:10 AM