Watch: మరోసారి ఆర్టీసీ బస్సులో మహిళల యుద్ధం.. చెప్పులతో కొట్టుకున్న ఆడ లేడీస్‌ ఫైట్‌ చూస్తే.. – Telugu News | Hyderabad Bus Fight Women Brawl Over State, Police Involved

Written by RAJU

Published on:

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు నిత్యం కిక్కరిసి పోతున్నాయి. బస్సులో సీటు చాలా చోట్ల అందని ద్రాక్షలా మారిపో యింది. ఈ క్రమంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ జిల్లాలోని హాకీంపేటకు చెందిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు ఎక్కారు. ఇద్దరు మహిళల మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఓ మహిళ మరో మహిళకు సపోర్ట్ రావడంతో చెప్పుల తో కొట్టుకునే స్థాయికి చేరుకుంది.

బస్సు ప్రయాణికులతో నిండిపోవడంతో చాలా మంది మహిళలకు సీట్లు దొరకలేదు. దీంతో సీట్ల కోసం గొడవ జరిగింది. సీటు తమదంటే తమ దంటూ గొడవకు దిగారు. మాటలు కాస్త కొట్టుకునే దాకా వెళ్లింది. ముగ్గురు మహిళలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసు కున్నారు. వారి గొడవను బస్సు కండక్టర్ గొడవ ఆపడానికి ఎంత ప్రయత్నించినా, వారించినా మహిళలు వినకపోవడం తో బొల్లారం పోలీస్ స్టేషన్ లో బస్ కండక్టర్ ఫిర్యాదు చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

కాగా..అసలు విషయం ఏమిటంటే ఇద్దరు మహిళలు మద్యం తాగి గొడవ పడినట్లు తెలుస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Subscribe for notification