నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మద్యం అలవాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్లో పాల్గొన్న దేవి మాట్లాడుతూ తనకు మద్యం తాగే అలవాటు అస్సలు లేదని చెప్పారు. కనీసం సిగరెట్ కూడా తాగనని, తాను వాటికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తన ఈవెంట్స్, షోలలో కూడా మందు ఉండదని చెప్పారు. ఫుడ్ మాత్రం అన్ని రకాలుగా ఉంచుతామని తెలిపారు. కేరీర్ కోసం తాను మద్యానికి దూరంగా ఉంటున్నానని చెప్పారు. నా దృష్టిలో మందు సేవించడం అనేది ఒక వ్యసనం లాంటిదని అన్నారు. దానికి అలవాటు పడితే కేరీర్ నాశనం అవుతుందన్నారు. మద్యంకు అలవాటు పడి కేరీర్ నాశనం చేసుకున్న వారిని ఎంతో మందిని తాను చూశానని పేర్కొన్నారు. అందుకే ఈ విషయంలో ప్రిన్సిపుల్స్ను బలంగా పాటిస్తానని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

దానికి అలవాటుపడితే కెరీర్ నాశనమే: దేవిశ్రీప్రసాద్
Written by RAJU
Published on: