Heavy police deployment in front of TGPSC..

Written by RAJU

Published on:

  • టీజీపీఎస్సీ కార్యాలయం ముందు భారీగా పోలీస్ బందోబస్తు
  • పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మోహరింపు
  • గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో..
  • నిరసనలు జరుగుతాయామోనని ముందస్తుగా పోలీస్ బందోబస్తు.
Heavy police deployment in front of TGPSC..

హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యాలయం ముందు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా.. పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మోహరించాయి. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో నిరసనలు జరుగుతాయామోనని ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఉన్నారు. కాగా.. గ్రూప్-1 ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పకడ్బందీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Read Also: BRS: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..

కాగా.. గ్రూప్ -1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే.. గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు.గ్రూప్-2లో మొత్తం 783 పోస్ట్‌ల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది హాజరు అయ్యారు. అంతకుముందు గ్రూప్‌-1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలను భర్తీ చేశారు.

Read Also: Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుంచి మహిళలకు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం

Subscribe for notification