ABN
, Publish Date – Mar 16 , 2025 | 01:05 AM
గంభీరావుపేట- లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై హై లెవల్ బ్రిడ్జిని వెంటనే నిర్మిం చాలని అఖిల పక్షంలో ఆధ్వర్యంలో నాయకులు శనివారం ధర్నా, నిరసన దీక్ష చేపట్టారు.

గంభీరావుపేట, మార్చి 15 (ఆంధ్ర జ్యోతి) గంభీరావుపేట- లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై హై లెవల్ బ్రిడ్జిని వెంటనే నిర్మిం చాలని అఖిల పక్షంలో ఆధ్వర్యంలో నాయకులు శనివారం ధర్నా, నిరసన దీక్ష చేపట్టారు. హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగు తోందని ఆరోపిస్తూ లింగన్నపేట మానేరు వాగు వద్ద బైఠాయించారు. లింగన్నపేట బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలోనే రూ. 17 కోట్లు నిధులు మంజూరు కాగా, తరువాత నిధులు కుదించినప్పటికి పనులు మాత్రం మొదలవ్వడం లేదని వాపోయారు. కొత్త బ్రిడ్జి కోసం ఆఘమేఘాల మీద పాత లోలెవల్ బ్రిడ్జిని కూల్చివేసి, తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారని, కానీ 15 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదన్నారు. మళ్లీ వర్షాకాలం వస్తే తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కాస్త కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. వర్షాకాలం రాకముందే కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హై లెవల్ బ్రిడ్జి కోసం ఆందోళనలు, ధర్నాలు చేపట్టిన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణం పనులు తొందరగా చేపట్టకుంటే దశల వారీగా ఉద్యమాలు చేపట్టి, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో శివసేన జిల్లా ఇంచార్జీ గౌటే గనేష్, బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడు పెద్దూరు పర్శాగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు దేవేందర్ యాదవ్, మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, గ్రామ పురో హితులు పార్థసారది శర్మ, రాజుపేట మాజీ సర్పంచ్ అల్లె సత్యం, నాయకులు కృష్ణకాంత్, ప్రవీణ్, శ్రావణ్ మహిళలు ఉన్నారు.
Updated Date – Mar 16 , 2025 | 01:05 AM