Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: ఎండ వేడి రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో, దాహం తీర్చుకునేందుకు జనాలు మంచి నీళ్లతో పాటు కొబ్బరి నీళ్ల వంటి రకరకాల పానీయాలవైపు మళ్లుతున్నారు. ఇక కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంత మంచివైనా వీటి విషయంలో కొంత జాగ్రత్త అవసరమని వైద్యులు చెబుతున్నారు. లేకపోతే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు (Coconut water High Potassium).

కొబ్బరి నీళ్లల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో లవణాల సమతౌల్యానికి, కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరుకు ఎంతో అవసరం. ఒక కప్పు కొబ్బరి నీళ్లల్లో సుమారు 600 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ఇతర పానీయాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కొబ్బరి నీళ్లల్లో 95 శాతం నీరే ఉంటుంది. పొటాషియం తరువాత సోడియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి కొద్ది మొత్తంలో ఉంటాయి. దీంతో, చక్కెర అధికంగా ఉండే ఇతర పానీయాలతో పోలిస్తే ఇవి ఎంతో మెరుగు.

Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలోకు రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

నిపుణులు చెప్పే దాని ప్రకారం, కొబ్బరి నీళ్ల ప్రయోజనాలకు సంబంధించి జనబాహుళ్యంలో అనేక అపోహలు ఉన్నాయి. వీటితో చెక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని, కొలెస్టరాల్ తగ్గిస్తుందని, శరీరానికి కావాల్సినంత నీరు లభిస్తుందని జనాలు అనుకుంటారు. అయితే, ఇవ్నీ శాస్త్రపరంగా రుజువైన విషయాలు కావని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వారు కొబ్బరి నీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరితో పాటు శరీరంలో పొటాషియం నిల్వలను పెంచే ఔషధాలు తీసుకునేవారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వారు అతిగా కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది చివరకు కిడ్నీలపై ప్రభావం పడుతుంది. అధిక పొటాషియం గుండెకు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇందులో చక్కెర ఎంత తక్కువగా ఉన్నా కూడా డయాబెటిక్ రోగులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Chopped Vegetable in Fridge: ఈ కూరగాయల ముక్కలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు

ఇందుకు సంబంధించి వైద్యులు ఓ కేసు స్టడీ కూడా పేర్కొంటారు. టెన్నిస్ క్రీడాకారుడు ఒకరు ఓ రోజున ఏకంగా 2.5 లీటర్ల కొబ్బరి నీరుతాగారు. ఆ తరువాత ఆట ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. అధిక పొటాషియం కారణంగా అతడికీ పరిస్థితి వచ్చిందని వైద్యులు ఆ తరువాత తేల్చారు. అతడి గుండె కొట్టుకోవడంలో మార్పులు, కిడ్నీ సమస్యలు మొదలై కుప్పకూలినట్టు చెప్పారు. అయితే, సమయానికి చికిత్స అందించడంతో అతడు కోలుకున్నాడు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలున్న వారిలో పొటాషియం శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంది. ఇది చివరకు పలు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.

Read Latest and Health News

Subscribe for notification