హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం.. రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. స్పీండ్ కంట్రోల్, ఇతర సమాచారం తెలిపే డిజిటల్ సైన్ బోర్డులు పని చేయడం లేదు. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ లైన్లలో ఏ వాహనాలు వెళ్లాలో తెలియక.. ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా సంబంధింత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.