– ప్రశాంతంగా రాస్తేనే మంచి ఫలితాలు
– పౌష్టికాహారం తీసుకుంటేనే ఏకాగ్రత
– ప్రశ్నలను క్షుణ్ణంగా చదవాలి.. ఆ తర్వాతే సమాధానాలు రాయాలి
హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో పరీక్షల సీజన్ వచ్చేసింది. ఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. పరీక్షలు రాసే సమయంలో చదవడం మరో ఎత్తుగా హైరానా పడుతుంటారు. తాము చదివినదంతా పరీక్ష(Exams) రాసే సమయంలో గుర్తుకు ఉంటుందో.. లేదోనని ఆందోళన చెందుతుంటారు. పరీక్షల సమయంలో ప్రతి ఒక్క విద్యార్థి తమ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సైకాలజీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఒత్తిడి, భయం, ఆందోళనకు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Exams: టెన్త్ పరీక్షల్లో కొత్తగా 24 పేజీలతో ఆన్సర్ షీట్
గదిలో ప్రశాంతంగా కూర్చోవాలి
పరీక్ష గదిలోకి వెళ్లిన తర్వాత విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లలో ముందుగా ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రశ్నాపత్రం తీసుకున్న తర్వాత ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదవాలి. ఆ తర్వాతే రాయడం ప్రారంభించాలి. త్వరగా సమాధానాలు రాయాలనే ఆరాటంలో చాలామంది తెలిసిన ప్రశ్నలను కూడా అసంపూర్తిగా రాసి మార్కులను కోల్పోతుంటారు. అలాకాకుండా ఒక్కోదానికి తగిన సమయం తీసుకుని చక్కగా రాస్తేనే మంచి మార్కులు వస్తాయి. పరీక్షకు ముందు ప్రత్యేకమైన టైంటేబుల్‌ను రూపొందించుకోవాలి. ఒక సబ్జెక్టు చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలు, ప్రత్యేకమైన విభాగాలను నోట్ చేసుకోవాలి. సమాధానంలోని ముఖ్యాంశాలను ఒకదాని వెంట ఒకటి ఆర్డర్ ప్రకారం సబ్ హెడ్డింగ్స్‌తో రాస్తే మంచి మార్కులు వస్తాయి.
ఏకాగ్రత కోల్పోవద్దు
పరీక్షల సమయంలో రోజుకు కంటి నిండా నిద్రపోతేనే చక్కగా సమాధానాలు రాయగలరని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే ఆకలితో ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలంటే టిఫిన్ లేదా సలాడ్, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటివి తీసుకోవాలని పేర్కొంటున్నారు.
పరీక్షలను భూతద్దంలో చూడొద్దు
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను విద్యార్థులు భూతద్దంలో చూడొద్దు. వాటిని ఏడాదిలో రాసిన ఎఫ్‌ఏ, ఎస్‌ఏ మాదిరిగానే భావించి రాయాలి. లైఫ్‌లో పరీక్షలు ఒక పార్ట్ మాత్రమే. దీనిని జీవన్మరణ సమస్యగా భావించి ఆందోళనకు గురికావద్దు. పర్సంటేజీలపై పిల్లలకు టార్గెట్ విధించకుండా తల్లిదండ్రులు వారికి మనోధైర్యం కల్పించాలి.
– స్వాతి, సైకాలజీ ఫ్రొఫెసర్
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News
Updated Date – Mar 05 , 2025 | 08:35 AM