AP EAPCET Registration 2025 : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అధికారిక వెబ్సైట్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళ్తే..

అనంతరం మే 19 నుంచి 27 వరకు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో రోజుకు రెండు విడతలుగా నిర్వహించారు. ఇంజినీరింగ్ పరీక్ష మే 21 నుంచి 27 వరకు రోజుకు రెండు విడతలుగా నిర్వహిస్తారు. వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని మే 21వ తేదీన, ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ని మే 28న విడుదల చేస్తారు. తుది ‘కీ’ని జూన్ 5న ప్రకటిస్తారు. ఇప్పటికే ఏపీ ఎంసెట్ 2025 షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ పరీక్ష సందర్భంగా ఏపీలో 46, హైదరాబాద్‌లో 2 కేంద్రాల్లో కలిపి మొత్తం 48 చోట్ల పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. మే 12 నుంచి హాల్‌టికెట్లను ఈఏపీసెట్ వెబ్‌సైట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ నంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకునేవారు కర్నూలులోని ప్రాంతీయ కేంద్రంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించ్చు. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.
ఏపీ ఈసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం :
బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈసెట్ 2025కు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తులో తప్పుల సవరణకు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు సమయం ఇచ్చారు. అనంతరం మే 1 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 6న ప్రవేశ పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలకు లింక్ ఇదే.
ఏపీ ఐసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం:
ఉన్నత విద్యా సంస్థల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్ 2025 మార్చి 13వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులకు ఏప్రిల్ 9వ తేదీ చివరి గడువుగా విధించారు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తులో తప్పుల సవరణకు ఏప్రిల్ 29 నుంచి 30 వరకు సమయం ఉంటుంది. అనంతరం మే 2 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు లింక్ ఇదే.