Telangana Group 3 Result 2024 : తెలంగాణలో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల వేగవంతమైంది. ఇప్పటికే ఆన్సర్ కీలు విడుదల చేసిన టీజీపీఎస్సీ కమిషన్ ఫలితాల విడుదలపై దృష్టిసారించింది.

తెలంగాణ రాష్ట్రంలో 1,365 Group 3 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అయితే.. తాజాగా ఈ గ్రూప్ 3 పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. ఈ ప్రిలిమినరీ కీపై జనవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలను తెలిపారు.
అనంతరం ఈ అభ్యంతరాలపై సమీక్ష నిర్వహించి ఫైనల్ కీ, ఫలితాలను విడుదల చేస్తారు. తాజా సమాచార ప్రకారం.. ఫిబ్రవరి నెలలో ఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. TGPSC Group 3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదట 1401 పోస్టులతో 2022 డిసెంబర్ 30వ తేదీన TSPSC Group 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలకు సంబంధించిన వివరాలకు ఎప్పటికప్పుడు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ చూడొచ్చు.
TGPSC Group 1 : మార్చి 31లోపు గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో 563 గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 14 ఏళ్లుగా వీటి నియామకాలు గ్రూప్ 1 చేపట్టలేదన్నారు. TSPSC GROUP 1 పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వానికి అండగా నిలిచాయని.. మార్చి 31 లోపు ఈ నియామకాలు పూర్తి చేస్తామని పేర్కొననారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇది దేశంలోనే రికార్డని పేర్కొన్నారు. పదేళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నామని.. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడిందని రేవంత్ రెడ్డి కొనియాడారు.