ఇంటర్నెట్ డెస్క్: పండ్లు ఎంత రుచికరమైనవో అంత ఆరోగ్యకరమైనవి కూడా. అయితే, అమెరికాలో కూడా ప్రజలు తాము తినవలసిన మొత్తంలో కేవలం 10 శాతం పండ్లు మాత్రమే తింటున్నట్టు ఓ సర్వేలో తేలింది. వివిధ రకాల పండ్లను సమపాళ్లల్లో తింటే విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం వంటివన్నీ సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి, ఆయా సీజన్లలో లభించే వివిధ రకాల పండ్లను ఓ చిన్న బౌల్ మేర తింటే ఎన్న ప్రయోజనాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
రోజూ పండ్లు తినే వారిలో కొవ్వు తక్కువగా ఉంటున్నట్టు వైద్యులు ఎప్పుడో గుర్తించారు. ఈ అలవాటుతో సులభంగా బరువు తగ్గుతారు. బెర్రీలు, దానిమ్మ తప్పనిసరిగా తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
Signs of Heart Disease In Legs: కాళ్లల్లో ఈ మార్పులు గుండె జబ్బులకు సంకేతం
పండ్ల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ అనే అణువులను నిర్వీర్యం చేసి శరీరంంలో ఇన్‌ఫ్లమేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా శరీరానికి నూతన జవసత్వాలు లభించడమే కాకుండా యవ్వన కాంతి సంతరించుకుంటుంది. నారింజకు ఈ శక్తి అత్యధికం
తరచూ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. పండ్లలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఫైటోన్యూట్రియంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
పీచు పదార్థం సమృద్ధిగా ఉండే పండ్లతో జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. పీచు పదార్థం కారణంగా కడుపు నిండుగా అనిపిస్తుంది. ఫలితంగా తిండి తగ్గి బరువు కూడా తగ్గుతారు. ఊబకాయం నుంచి విముక్తి లభిస్తుంది. పండ్లు.. పేగుల్లోని హితకర బ్యాక్టీరియాను ప్రోత్సహించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Green Grapes Vs Black Grapes: ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏటంటే..
పండ్లు రోజూ తినే వారిలో చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ప్రభావాన్ని తగ్గించి చర్మ కణాలకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో, చర్మం ఆరోగ్యవంతంగా మారుతోంది. ఫ్రీరాడికల్స్ ప్రభావం తగ్గి చర్మంలోని కొల్లాజన్ బలోపేతం అవుతుంది. ముడతలు, నల్లని ఛాయ తొలగిపోతుంది.
ఇక పండ్లల్లో పుష్కలంగా ఉండే నీరు డీహైడ్రేషన్‌ను దరిచేరనివ్వదు. ఫలితంగా, శరీరంలోని వ్యవస్థలన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి.
Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!
Read Latest and Health News