Hyderabad: మందుల అక్రమ నిల్వలకు అడ్డాగా హైదరాబాద్‌..

Written by RAJU

Published on:

– ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకు కొరియర్‌ రూపంలో తరలింపు

– ఇక్కడే మందుల తయారీ, నిల్వలు, అమ్మకాలు

– వివిధ రూపాల్లో విదేశాలకు సరఫరా

హైదరాబాద్‌ సిటీ: నగర శివారు ప్రాంతాల్లో అక్రమంగా మందులు తయారీ చేయడం, నిల్వలు ఉంచడం, మార్కెట్‌లో చలామణి చేయడం సర్వసాధారణంగా మారింది. తెల్లటి పొడి లేదా స్పటికాల రూపంలో మందులను తయారీచేసి ఎవరికీ అనుమానం రాకుండా వివిధ రూపాల్లో విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు చేస్తున్న దాడుల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి.

ఈ వార్తను కూడా చదవండి: MP R. Krishnaiah: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి..

నిషేధిత మందుల తయారీ

డ్రగ్స్‌, కాస్మెటిక్స్‌ చట్టం ప్రకారం డ్రగ్‌ లైసెన్స్‌(Drug license)తో మాత్రమే మందులను ఉత్పత్తి చేయాలి. కానీ నిబంధలకు విరుద్ధంగా పలువురు మందులను తయారీ చేసి సరఫరా చేస్తున్నారు. ఏ మందులను అయినా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లేకుండా ఉత్పిత్తి చేయడం, విక్రయించడం నేరం. వీటితో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.

సిగరెట్ల రూపంలో విదేశాలకు..

గతంలో అధికారులు చేసిన దాడుల్లో ఏకంగా రూ.9 కోట్ల విలువైన అక్రమ నిల్వ, నిషేధిత మందులను స్వాధీనం చేసుకున్నారు. మరోచోట రూ.4.3 కోట్ల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారం(IDA Bollaram)లో ఓ సంస్థలో నిషేధితమందును తెల్లటి పొడిగా తయారు చేసి సిగరెట్ల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తుండడంతో నిఘాపెట్టిన ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు ఆ గుట్టును రట్టు చేశారు.

city7.jpg

కొరియర్‌ ద్వారా నగరానికి..

ఇతర రాష్ట్రాల నుంచి ముడి సరుకులను పార్సిల్‌ రూపంలో కొరియర్‌ ద్వారా నగరానికి తెప్పిస్తున్నారు. వాటిని నిల్వ చేస్తూ మందులను తయారు చేసి విక్రయిస్తున్నారు. గతంలో మచ్చబొల్లారంలోని ఓ సంస్థపై దాడి చేయగా దాదాపు రూ.4.3 కోట్లకు సంబంధించిన 36రకాల మందులు బయట పడ్డాయి. డిసెంబరు 29న ఉత్తరాఖండ్‌లోని ఖాసీపూర్‌ నుంచి వచ్చిన మందులను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందంతో కలిసి దాడిచేసి సుమారు రూ.26 లక్షల విలువజేసే మందులను పట్టుకుని సీజ్‌ చేశారు. ఇలా గ్రేటర్‌లో చాలాచోట్ల అక్రమ మందుల నిల్వలు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అధికారులు విస్తృతంగా దాడులుచేసి అక్రమ, నిషేధిత మందుల సరఫరాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

దాడుల్లో బయటపడినవి..

ఐడీఏ బొల్లారంలో గతంలో చేసిన దాడుల్లో దాదాపు రూ.8.99 కోట్ల విలువైన 90.40కిలోల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలలోని ఓ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ తన ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి నార్కోటిక్‌ డ్రగ్స్‌ను పార్సిల్స్‌, కొరియర్‌ ద్వారా హైదరాబాద్‌కు పంపించి సైనిక్‌పురాకు సరఫరా చేసినట్లు తేలింది. అలాగే ఐడీఏ బొల్లారంలోని ఓ ల్యాబ్‌లో అక్రమంగా అల్ఫా మందుల తయారీని గుర్తించి రూ.233కోట్ల విలువగల మందులను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని మౌలాలి, మల్కాజిగిరిలో ఓ వ్యక్తి ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన మార్ఫిన్‌ ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, ఫెంటానిల్‌ సిట్రేట్‌ ఇంజెక్షన్లు, సీట్రేట్‌ ప్యాచెస్‌, పెంటాజోసిన్‌ ఇంజెక్షన్లు, మత్తు మందులను భారీగా స్వాధీనం చేసుకున్నారు. వీటిని హైదరాబాద్‌లోని పలు లైసెన్స్‌ లేని సంస్థలకు సరఫరా చేసేందుకు నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

city7.3.jpg

ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ ల బదిలీలు!?

ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

Read Latest Telangana News and National News

Subscribe for notification