-రాళ్లవాగులో ప్రారంభమైన సాయిల్ టెస్ట్ పనులు
-రూ. 13.50 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో నిర్మాణం
మంచిర్యాల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం లోని రాళ్లవాగుపై హై లెవల్ వంతెన నిర్మాణానికి ఎట్టకే లకు మోక్షం లభించింది. రాళ్లవాగులో సాయిల్ టెస్ట్ పను లను కాంట్రాక్టర్ ప్రారంభిండంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయింది. స్థానిక బైపాస్ రోడ్డులోని తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద ఉన్న కాజువే బ్రిడ్జి స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు 10 మార్చి 2024న భూమి భూ మిపూజ చేశారు. సరిగ్గా ఏడాది తరువాత బ్రిడ్జి నిర్మాణ పనులకు ముహూర్తం కుదరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాజువే వంతెనతో ఇంతకాలం ఇబ్బందులు పడుతున్న రంగంపేట, పవర్ హౌజ్ కాలనీ, అండాళమ్మ కాలనీల ప్రజల కష్టాలు హై లెవల్ బ్రిడ్జితో తీరనున్నాయి.
2005లో కాజువే నిర్మాణం…
పట్టణంలోని లక్ష్మీటాకీస్ ప్రాంతాన్ని, పాత మంచిర్యాల సమీపంలోని రంగంపేటను కలిపేందుకు 2005లో సుమా రు రూ. 80 లక్షల అంచనా వ్యయంతో రాళ్లవాగుపై పైపు లతో కూడిన కాజువే వంతెన నిర్మించారు. బైపాస్ రోడ్డు లోని తెలంగాణ అమరుల స్థూపం నుంచి వంతెన మీదు గా ప్రజలు ఆయా ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగి స్తారు. అంతకు ముందు వంతెన లేని సమయంలో ఆ ప్రాంత ప్రజలు పట్టణానికి రావాలంటే పాత మంచిర్యాల మీదుగానో, అండాళమ్మ కాలనీ మీదుగా ఎంసీసీ క్వారీ రోడ్డులో ఐదారు కిలో మీటర్లు ప్రయాణించేవారు. దీంతో ప్రజలకు దూర భారం పెరగడంతోపాటు అధిక వ్యయ ప్రయాసలకు గురి అయ్యేవారు. కాజువే వంతెన నిర్మాణం తరువాత కేవలం అర కిలోమీటర్ ప్రయాణించి పట్టణా నికి చేరుకుంటున్నారు. పాలు విక్రయిస్తూ జీవనం సాగిం చే రంగంపేట ప్రజలు ఈ వంతెన గుండానే ప్రయాణి స్తారు. అలాగే విద్యార్థులు ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రా ళ్లపేట, బైపాస్ రోడ్డు ప్రాంతంలోని ప్రజలు ఇప్పటికీ కా జువే వంతెన పై నుంచి పాత మంచిర్యాల మీదుగా ఇ తర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు.
వరదలకు కూలిన వంతెన…
రాళ్లవాగుపై తాత్కాలికంగా నిర్మించిన కాజువే 2019లో కురిసిన భారీ వర్షాల కారణంగా కుప్పకూలిపోయింది. అ ప్పటి ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కూలిన బ్రిడ్జిని పరిశీలించారు. దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ప్రజా ప్రతినిధులుగానీ, మున్సిపల్ పాలక వర్గం గానీ శాశ్వత పరిష్కారం చూపలేదు. కూలిన చోట తాత్కాలికంగా మ ట్టిపోసి రాకపోకలను పునరుద్ధరించేవారు. దీంతో ప్రతి యేటా వర్షాకాలంలో రాళ్లవాగు ఉప్పొంగినప్పుడల్లా వంతెన నీట మునిగి మట్టి కొట్టు కుపోవడం, తరువాత యథాతదంగా తాత్కాలిక చర్యలు చేపట్టడం ఆనవాయితీగా మారింది. కాజువే వంతెన నిర్మాణానికి ముందు అదే ప్రాంతంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఉండేది. అ యితే 2005కు పూర్వం ఆ ప్రాంతం పెద్దగా అభివృద్ధి చెందకపోవ డంతో అప్పటి పాలకులు కాజువే వంతెనతో సరిపెట్టారు. కాల క్ర మంలో రంగంపేట ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందడం, సమీ పంలో కొత్త కాలనీలు ఏర్పాటు కావడంతో ప్రజల సౌకర్యార్థం హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదనలు తెరమీదికి వచ్చాయి. పాల కులు సైతం హైలెవల్ బ్రిడ్జి ఆవశ్యకతపై అనేక సార్లు ప్రస్తావన కు తెచ్చారు. అయితే దశాబ్దాలు గడిచినా వంతెన నిర్మాణం కేవ లం ప్రతిపాధనలకే పరిమితం అయిందిగానీ ఆచరణలోకి రాలేదు.
ఫరూ. 13.50 కోట్లతో హై లెవల్ వంతెన…
ప్రజల విన్నపాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేం సాగర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో కాజువే స్థానంలో హై లెవల్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) నిధు లు రూ. 13.50 కోట్లతో హై లెవల్ వంతెన నిర్మాణానికి గత ఏడాది భూమి పూజ చేశారు. హై లెవల్ వంతెన నిర్మాణంతో అవతలి వై పు ఉన్న పాత మంచిర్యాల, రంగంపేట, పవర్ హౌజ్ కాలనీ, అం డాళమ్మకాలనీ ప్రజలకు రాకపోకలు సులభతరం కానుండగా, ఆ యా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు అనేకం ఉ న్నాయి. తెలంగాణ అమరవీరుల స్థూపం మొదలుకొని వాగు అవ తలివైపు సుమారు 200 మీటర్ల పొడవుతో వంతెన నిర్మాణం జరు గనుండగా, మొత్తంగా రూ. 20 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
ఫసాయిల్ టెస్ట్‌తో చిగురిస్తున్న ఆశలు..
హై లెవల్ వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్ సాయిల్ టెస్ట్ పను లు ప్రారంభించడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రెండు రో జులుగా సిబ్బంది రాళ్లవాగులో సాయిల్ టెస్ట్ పనుల్లో నిమగ్నమ య్యారు. సాయిల్ టెస్ట్ పూర్తయి, వంతెన నిర్మాణానికి సంబంధిత అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉ న్నాయి.
Updated Date – Mar 14 , 2025 | 11:46 PM