మహీంద్రా ఎక్స్యూవీ700 ఇంజన్ ఆప్షన్స్
ఎక్స్ యూవీ 700 రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 2.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 5,000 ఆర్ పిఎమ్ వద్ద 197 బిహెచ్ పి శక్తిని, 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 1,750 ఆర్ పిఎమ్ నుండి 3,000 ఆర్ పిఎమ్ మధ్య లభిస్తుంది. రెండు ఇంజన్ రకాలు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడతాయి. డీజల్ ఇంజన్ గరిష్టంగా 3,500 ఆర్పిఎమ్ వద్ద 182 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ గేర్బాక్స్ తో కలిపినప్పుడు 420 ఎన్ఎమ్ టార్క్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎంఎక్స్ ట్రిమ్ లో డీజిల్ ఇంజన్ 3,750 ఆర్ పిఎమ్ వద్ద 152 బిహెచ్ పి పవర్, 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ ప్రత్యేకంగా 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో లభిస్తుంది.