CM Yogi Adityanath Celebrates Holi with Public in Gorakhpur

Written by RAJU

Published on:

  • దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ
  • ప్రజల మధ్య హోలీ జరుపుకున్న సీఎం యోగి
  • హోలీ సందర్భంగా కీలక సందేశం
CM Yogi Adityanath Celebrates Holi with Public in Gorakhpur

దేశవ్యాప్తంగా నేడు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జనాల మధ్య పండుగను ఘనంగా జరుపుకున్నారు. గోరఖ్‌నాథ్ ఆలయ సముదాయంలోని హోలికా దహన్ స్థలంలో పూజలు నిర్వహించారు. ఆపై హోలీ వేడుకలను ప్రారంభించారు. సీఎం యోగి ప్రజలపై పువ్వులు కురిపిస్తూ.. రంగులు చల్లుతూ హోలీ ఆడారు. సోషల్ మీడియాలో ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పోస్ట్ కూడా చేశారు. హోలీ సందర్భంగా హిందువులకు సీఎం యోగి కీలక సందేశం ఇచ్చారు. జాతీయ ఐక్యత యొక్క ప్రాముఖ్యతను మరో సారి గుర్తు చేశారు.

READ MORE: Amaravati Capital: రాజధాని పనుల ప్రారంభానికి రెడీ.. ప్రధాని మోడీకి ఏపీ సర్కార్ ఆహ్వానం..!

భారతదేశం దాని ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుందని అన్నారు. భారతదేశం ఐక్యంగా ఉంటే.. ప్రపంచంలో ఏ శక్తి కూడా మన దేశం అభివృద్ధి చెందకుండా ఆపలేని హితవు పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన మహా కుంభమేళాను యోగి ప్రస్తావిస్తూ.. సనాతన ధర్మాన్ని విమర్శించే వారందరూ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో భారతదేశం యొక్క బలాన్ని చూశారన్నారు. అక్కడ 66 కోట్లకు పైగా ప్రజలు ఎటువంటి వివక్షత లేకుండా పవిత్ర స్నానాలు చేశారని సీఎం తెలిపారు. మహా కుంభమేళా వంటి అద్వితీయ దృశ్యాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని చెప్పారు. హిందువులు కుల ప్రాతిపదికన విభజించబడ్డారని భావించేవారు కుంభమేళాను చూడాలన్నారు.

READ MORE: Chiranjeevi-Anil Ravipudi: చిరంజీవి-అనిల్ ‘మెగా’ స్పీడ్.. త్వరలోనే సెకండ్ హాఫ్‌?

Subscribe for notification