Head Bath During Periods: పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేస్తే ఏమవుతుంది? ఈ సందేహం మీకూ ఉందా.. – Telugu News | Is Washing Hair During Menstruation Safe? Know here

ప్రతి నెలా అమ్మాయిల లైఫ్‌లై జరిగే సహజ ప్రక్రియల్లో పీరియడ్స్‌ ఒకటి. సాధారణంగా ఇది నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో కొందరికి తీవ్రంగా కడుపు నొప్పి, తలనొప్పి వంటి వివిధ సమస్యలు తలెత్తుతాయి. అయితే మన సమాజంలో ఋతుస్రావం గురించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సమయంలో మహిళలు కూరగాయలను ముట్టుకోకూడదని, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదని కొందరు అంటుంటారు. ఇలాంటి వివిధ మూఢనమ్మకాల్లో ఒకటి.. పీరియడ్స్‌ సమయంలో తలస్నానం చేయకూడదు. తల స్నానం చేస్తే ఆరోగ్యానికి హానికరమని పెద్దలు సైతం అంటుంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో ఇక్కడ తెలుసుకుందాం..

తల స్నానం చేయడానికి, పీరియడ్స్‌కు సంబంధం ఏంటీ?

చాలా మంది పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయడానికి నిరాకరిస్తారు. కానీ వైద్యుల అభిప్రాయం ప్రకారం.. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. చల్లటి నీరు పీరియడ్స్‌ నొప్పిని మరింత తీవ్రం చేస్తుందని, రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందని కూడా చెబుతుంటారు. కానీ దీనికి వైద్య ఆధారాలు లేవు. అంతేకాకుండా స్నానం, పీరియడ్స్‌ మధ్య ప్రత్యక్ష శాస్త్రీయ సంబంధం అంటూ ఏదీ లేదు. అయితే కొంతమంది మహిళలు ఈ సమయంలో స్నానం చేసేందుకు భయపడతారు. ఎందుకంటే ఈ సమయంలో వారి శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అలాంటి సమయంలో స్నానం చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఈ ప్రక్రియ శారీరక అలసటకు కూడా దారితీస్తుంది. అంతేకాకుండా, బహిష్టు సమయంలో సంభవించే హార్మోన్ల మార్పులు, శారీరక అసౌకర్యం కారణంగా మహిళలకు విశ్రాంతి చాలా అవసరం. కాబట్టి స్నానం చేయడం వల్ల శరీరం మరింత బలహీనపడుతుంది. కాబట్టి ఇలాంటి వారు తల స్నానం చేయకపోవడమే మంచిది.

చల్లని నీటితో స్నానం చేయడం వల్ల సమస్యలు వస్తాయా?

పీరియడ్స్‌ సమయంలో స్నానం చేయడం వల్ల సంతానోత్పత్తిపై, గర్భాశయంపై ఎలాంటి ప్రభావం ఉండదని డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. కానీ ఇది శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మాత్రమే ఈ అసౌకర్యం కలుగుతుంది. చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీరు, కొద్దిగా వేడి నీటిని వాడటం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

తల స్నానం చేయొచ్చా?

పీరియడ్స్‌ సమయంలో పరిశుభ్రత చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. స్నానం చేయడం వల్ల శరీరానికి రిఫ్రెష్ లభించడమే కాకుండా అసౌకర్యం, తేలికపాటి నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గోరువెచ్చని నీరు కండరాలను సడలించి, శరీరక నొప్పిని తగ్గిస్తుంది. మొత్తంమీద ఈ సమయంలో స్నానం చేయడం పూర్తిగా సురక్షితం. ఇది శరీర పరిశుభ్రతకు చాలా మంచిది. కాబట్టి శాస్త్రీయ ఆధారం లేకుండా మూఢనమ్మకాలను నమ్మవద్దు. అంతేకాకుండా ఋతుస్రావం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. నిల్వ నీటితో స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

[

Leave a Comment