Teenmar Mallanna Viral Video: కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు రాకముందు ఆయన ఒక పాత్రికేయుడిగా పలు చానల్స్ లో పనిచేశారు. అప్పట్లో తీన్మార్ అనే ప్రోగ్రాం ద్వారా సుపరిచితుడయ్యారు. తద్వారా తన పేరును కాస్త తీన్మార్ మల్లన్నగా మార్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి తన పని చేస్తున్న ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం ప్రశ్నించే గొంతుకగా యూట్యూబ్ వేదికగా ప్రసారాలను మొదలుపెట్టారు. ప్రశ్నించే గొంతుకగా తనను తాను పరిచయం చేసుకున్నారు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. అనతి కాలంలోనే హస్తం పార్టీలో చేరారు. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో శాసనమండలి సభ్యుడిగా గెలుపొందారు.
శాసన మండల సభ్యుడిగా గెలుపొందిన తర్వాత కొద్ది రోజుల వరకు కాంగ్రెస్ పార్టీతో సఖ్యత గానే ఉన్నారు. ఆ తర్వాతే ఆయన దూరం జరగడం మొదలుపెట్టారు. మంత్రి పదవిని ఆశించారని.. ముఖ్యమంత్రి ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై తిరుగు జెండా ఎగరవేశారని తెలుస్తోంది. అంతేకాదు తన యూట్యూబ్ ప్రసారాల ద్వారా ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేతగానే తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నల్గొండలో పర్యటించినప్పుడు కొద్దిసేపు ఆయనతో తీన్మార్ మల్లన్న మాట్లాడారు.
వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసే కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు అప్పుడప్పుడు కొన్ని సరదా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. అవి నవ్వు తెప్పిస్తుంటాయి. బుధవారం గణపతి చవితిని పురస్కరించుకొని తన యూట్యూబ్ ఛానల్ లో విగ్నేశ్వర శ్లోకం చదివారు. తనతో పాటు సుదర్శన్ కూడా చదివారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే సుదర్శన్ మాత్రమే శ్లోకాన్ని గట్టిగా చదివారు. తీన్మార్ మల్లన్న మాత్రం ఏదో చదివాం అన్నట్టుగా పెదవులు కదిలించారు. దీనిని గులాబీ పార్టీ అనుకూ నెటిజన్లు పసిగట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. తీట ఫ్రెండ్ అంటే ఇలానే ఉంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వ్యాప్తిలో ఉంది.. గతంలో అనేక మంది రాజకీయ నాయకులను హస్తం పార్టీ శాసనమండలి సభ్యుడు విమర్శించారు. ఇప్పుడు ఆయనే విమర్శలకు గురవుతున్నారు. దీనినే కాల గతి అంటారేమో.
My Theeta frnds from today : pic.twitter.com/N3wZykDJfY
— Journalist Raavan.. (@Pinky_tweetss) August 26, 2025