Sugali Preethi Case: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వాటికి ప్రాణం వచ్చినట్లు అయ్యింది. ముఖ్యంగా అమరావతికి ఊపిరి పోసింది కూటమి ప్రభుత్వం. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించగలిగింది. అయితే రాష్ట్రంలో సంచలనంగా మారిన వివేకానంద రెడ్డి హత్య కేసు, సుగాలి ప్రీతి హత్య కేసులు కూడా త్వరగా ఛేదించి నిందితులకు శిక్షపడేలా కూటమి ప్రభుత్వం చేస్తుందన్న నమ్మకం కలిగింది. కానీ ఏడాదిన్నర అవుతున్న ఈ రెండు కేసులు కనీస స్థాయిలో కూడా ముందుకు కదలకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు కేసులను వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందన్న ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి వీటినే లేవనెత్తింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెండు కేసులను తేల్చేస్తామని ప్రకటనలు చేశారు. అందుకే టిడిపి మెడకు వివేకానంద రెడ్డి హత్య కేసు.. జనసేన మేడకు సుగాలి ప్రీతి కేసు చుట్టుకున్నాయి. వాటిని తేల్చకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ రెండు పార్టీలు మూల్యం చెల్లించుకోవడం తప్పదు.
Also Read: బీసీసీఐ అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేశాడు? అసలేం జరిగింది?
* రకరకాలుగా మలుపులు..
వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసు సంచలనంగా మారింది. గుండెపోటు, నారా సుర రక్త చరిత్ర, సిబిఐ అంటూ రకరకాలుగా వైసిపి దారులు మళ్లించింది. కానీ ఆ గొడ్డలి వేటు రక్తపు మరకలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూపించాయి. ఈ హత్య ఆరోపణలన్నీ వైఎస్ కుటుంబ సభ్యులు చుట్టే తిరిగాయి. అవినాష్ రెడ్డి నేరస్తుడు అంటూ వివేక కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిల టార్గెట్ చేశారు. అందుకు తగ్గ ప్రాథమిక ఆధారాలను కూడా బయటపెట్టారు. అయినా సరే వైసీపీ హయాంలో కేసు విచారణ అడుగు ముందుకు పడలేదు. అవినాష్ రెడ్డి చుట్టూ జగన్ వలయంగా ఏర్పడి కాపాడగలిగారు అన్నది బహిరంగ రహస్యం.
* ఆ స్లోగన్ తో టిడిపి..
వివేకా కేసులో సునీతకు న్యాయం జరగాలి.. హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు జవాబు చెప్పాలి అంటూ గత ఐదేళ్లలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ భారీ స్లోగన్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కు పెట్టింది. దోషులకు కొమ్ముకాస్తున్నారంటూ జగన్ పై నేరుగా టిడిపి కార్యకర్తల నుంచి నేతల వరకు విమర్శలు చేస్తూనే వచ్చారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర సమీపిస్తుంది. ఇంకా వివేకా కేసు విషయంలో అసలు వాస్తవాలు బయటకు రావడం లేదు. సునీత ఆరోపిస్తున్న వ్యక్తులు ధైర్యంగా తిరగ గలుగుతున్నారు. వివేకా కుమార్తె సునీత పోరాటానికి ఫలితం దక్కలేదు. కానీ వైసీపీ హయాంలో సునీతతో పాటు ఆమె భర్తపై పెట్టిన కేసులను మాత్రం కోర్టు కొట్టి వేయడం ఉపశమనం. అంతకుమించి ఈ కేసు ముందుకు సాగలేదు. అధికారుల సైతం ఈ కేసు విచారణ పూర్తయిందని కోర్టుకు నివేదించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకా గందరగోళం నడుస్తోంది.
* సుగాలి ప్రీతి కేసులో..
ఇదిలా ఉంటే సుగాలి ప్రీతి( sugali Preeti ) కేసు జనసేన మేడకు చుట్టుకుంది. 14 సంవత్సరాల గిరిజన బాలికను దారుణంగా హత్య చేశారు. చేయకూడని పని చేసి మట్టుపెట్టారు. ఈ కేసు ఏపీలో సంచలనంగా మారింది. అయితే ఈ కేసు మూలాలను, సాక్షాలను వైసిపి ప్రభుత్వం తుడిచేసింది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి హత్యకు గాను ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని.. వారి పోరాటాలకు ఫలితం దక్కాలి అంటూ నాడు వైసిపి ప్రభుత్వ హయాంలో పవన్ హీరో చిత పోరాటం చేశారు. దీంతో ఈ కేసు బాధ్యత జనసేనపై పడింది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉండడంతో ఇప్పుడు పవన్ ఈ కేసును తేల్చాల్సి వస్తోంది. సుగాలి తల్లి నేరుగా పవన్ పై ఇప్పుడు విమర్శలు చేయడంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. జనసేన పోరాట ఫలితం మూలంగానే ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని.. కానీ సుగాలి ప్రీతి కేసు లో నిందితులకు శిక్ష పడితేనే అసలు న్యాయం జరిగినట్టని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఈ రెండు కేసులను టిడిపి కూటమి తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఇబ్బందికరమే. ఈ రెండు కేసులలో అసలు దోషులు ఎవరు? అనేది నిరూపించ లేకపోతే టిడిపి కూటమికి ఇబ్బందికరమే. నిరూపించగలిగితే మాత్రం వైసీపీ అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళు అవుతారు.