Rohit Sharma to Undergo Fitness Test Today: భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ నేడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్నెస్ పరీక్షకు హాజరు కానున్నాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు అతని ఫిట్నెస్ను నిర్ధారించుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. రోహిత్ యో-యో టెస్టు, అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన 'బ్రోంకో టెస్ట్' కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇటీవలే టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు అతని ఫిట్‌నెస్‌పై కొంత సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఫిట్నెస్ పరీక్షకు ప్రాధాన్యత పెరిగింది.
మరోవైపు, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరీక్షకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం తన ప్రాక్టీస్‌ను ప్రారంభించినట్లు సమాచారం.
కొత్తగా ప్రవేశపెట్టిన 'బ్రోంకో టెస్ట్' ఆటగాళ్ల స్టామినాను పరీక్షించడానికి ఉద్దేశించింది. ఇందులో ఆటగాళ్లు వరుసగా 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరంలో షటిల్ రన్స్ చేయాలి. ఈ ప్రక్రియను ఐదు సార్లు ఏకధాటిగా ఆరు నిమిషాల్లో పూర్తి చేయాలి.
రోహిత్ శర్మ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరిస్థితిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.