హీరో నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.
ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రీమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
చాలా లేయర్స్ ఉన్నాయి
దీప్తి గంటా మాట్లాడుతూ, ‘నాని, ప్రశాంతి స్క్రిప్ట్ విని ఓకే చేశారు. నేను ఆన్ సెట్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యాను. నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. డైరెక్టర్ జగదీష్ చాలా బాగా రాసుకున్నాడు. చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నీ బాగా కనెక్ట్ చేసుకున్నాడు. జగదీశ్ ఈ సినిమాని చాలా రీసెర్చ్ చేసి రాశాడు. అందుకే సినిమా చాలా నేచురల్‌గా వచ్చింది. పోక్సో చట్టం గురించి ఆయన చాలా డీటెయిల్ ప్రజెంట్ చేశాడు. ‘హిట్ 3’ స్టేక్స్ చాలా పెద్దవి.. కానీ నాని ఈ సినిమా నచ్చకపొతే ‘హిట్ 3’ చూడొద్దని చెప్పడం మాకే షాక్ అనిపించింది. నేను, ప్రశాంతి.. డైరెక్టర్ శైలేష్ వంక చూశాం.(నవ్వుతూ) తనకి నమ్మకం ఉంది కాబట్టే ఆ మాటని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. నేను ‘మీట్ క్యుట్’ డైరెక్ట్ చేసిన తర్వాత యుఎస్ వెళ్ళిపోయాను. ఈ సినిమా కోసం మళ్ళీ వచ్చాను. కొన్ని ఐడియాలు ఉన్నాయి. వాటిని స్క్రిప్ట్‌గా డెవలప్ చేయాలి’ అని అన్నారు.
అది మాకు మంచి కాంప్లిమెంట్
‘నాని, నేను ఇద్దరం కథ వింటాం. అయితే మా నమ్మకం అంతా నాని జడ్జిమెంట్ మీదే ఉంటుంది. ఆయన పెద్దగా లెక్కలేమీ వేయరు. ఒక కథ థియేటర్లో చూడాలనిపించేలా ఉంటే ఓకే చేస్తారు. ప్రీమియర్స్‌కి యునానిమస్‌గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ అఫ్ చూసి ‘వావ్’ అన్నారు. సెకండ్ హాఫ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. సెకండ్ హాఫ్ లోని హైలెట్స్ కూడా ఆడియన్స్‌కి చాలా నచ్చాయి. రెస్పాన్స్ చాలా బావుంది. మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి జోనర్ సినిమాని ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. కొంత మంది లాయర్స్ ప్రీమియర్ చూసి, చాలా బాగా ఉందని ప్రశంసించారు. ‘ అని ప్రశాంతి తిపిర్నేని చెప్పారు.

ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది –
Written by RAJU
Published on: