Vaibhav Suryavanshi: క్రికెట్ ప్రపంచంలో తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇటీవలి కాలంలో ప్రతిచోటా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం 14 సంవత్సరాల వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసి, డేంజరస్ బ్యాటింగ్‌తో తుఫాన్ సెంచరీ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు కబడ్డీ రంగంలోనూ తనదైన శైలిలో కనిపించాడు.
నిన్న రాత్రి అంటే శుక్రవారం నుంచి ప్రో కబడ్డీ లీగ్ 12వ ఎడిషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ ప్రారంభోత్సవానికి వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైభవ్.. కబడ్డీ కోర్ట్‌లో కబడ్డీ ఆటగాళ్లతో క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ శుక్రవారం, ఆగస్టు 29న ప్రారంభమైంది. దీని ప్రారంభోత్సవానికి వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్‌ను చూసిన వెంటనే అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
When cricket’s next-gen met the Warriorz 🔥
Vaibhav Suryavanshi played cricket & witnessed the Pangebaazi up close ahead of the #PKL12 Grand Opening 👏#ProKabaddi #GhusKarMaarenge @rajasthanroyals pic.twitter.com/gTtQT0K1qs
— ProKabaddi (@ProKabaddi) August 29, 2025
ఈ సమయంలో కబడ్డీ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన వైభవ్, ఒకదాని తర్వాత ఒకటి 3 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత కబడ్డీ ఆటగాళ్లకు బౌలింగ్ కూడా చేశాడు. ఆ తర్వాత కబడ్డీ ఆటగాళ్లతో సరదాగా కాసేపు కబడ్డీ కూడా ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..