మందుబాబులకు.. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన టేస్ట్ ఉంటుంది. అంటే ఎంపికను బట్టి కొందరు విస్కీతో నీటిని కలపడం, కలపకపోవడం వంటివి చేస్తుంటారు. కానీ సైన్స్ ప్రకారం, విస్కీతో కొంత మొత్తంలో అయినా నీటిని కలపాలట. ఐస్, నీరు ఆల్కహాల్ రుచిని పెంచుతాయట. అయితే పింట్ విస్కీకి ఎంత నీరు కలపాలి? అనే విషయంలో విస్కీ ప్రియులకు పెద్దగా నాలెడ్‌జ ఉండదు. ఇటీవలి స్వీడిష్ అధ్యయనంలో సరైన మొత్తంలో నీటిని జోడించడం ద్వారా రుచి రెట్టింపు అవుతుందని తేలింది. స్కాచ్ విస్కీ పరిశ్రమలో రుచి, వాసన విశ్లేషణ కోసం విస్కీని 20 శాతం ABV (సుమారుగా సగం విస్కీ, సగం నీరు) వరకు పలుచన చేశారు. అంతే మందుబాబులకు యమకిక్కు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక ఐస్ కలపడం విషయానికి వస్తే, ఇది కొంచెం వివాదాస్పదమైన విషయం. ఎందుకంటే అది మీరు ఎక్కడ తాగుతున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. మనదేశంలో వాతావరణం ఎక్కువగా వేడిగా ఉంటుంది. కాబట్టి మీరు ఐస్ తో విస్కీ తాగవచ్చు.
విస్కీలో నీళ్లు కలపకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ సైన్స్ ఇందుకు విరుద్దం. కొంతమంది దీనిని ఒక సంప్రదాయంగా భావిస్తారు. కానీ పరిశోధకులు ఈ నమ్మకం తప్పని నిరూపించారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు విస్కీలో నీళ్లు కలపడం వల్ల కలిగే ప్రభావాలను అధ్యయనం చేసి, నీళ్లు కలపడం వల్ల విస్కీలోని అస్థిర సమ్మేళనాలు, రుచి అణువులు తెరుచుకుంటాయని, ఇది దాని రుచి, వాసనను మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. పరిశోధన ప్రకారం.. 60 మిల్లీలీటర్ల విస్కీకి 20 శాతం కంటే ఎక్కువ నీరు కలపకూడదు. అంటే దాదాపు 12 మిల్లీలీటర్ల నీరు కలపాలన్నమాట.
మీరు 20 శాతం కంటే ఎక్కువ నీటిని కలిపితే విస్కీలోని అన్ని రుచులు కలిసిపోతాయి. దీని వలన దానిలోని అనేక సూక్ష్మ రుచులు వేరు చేయలేని విధంగా తయారవుతాయి. అంతేకాకుండా, మార్కెట్లో విక్రయించే అనేక విస్కీలు వాటి తీవ్రతను నియంత్రించడానికి ఇప్పటికే నీరుగార్చబడ్డాయి. తద్వారా వాటిని త్రాగడానికి సులభం అవుతుంది. అందువల్ల విస్కీకి నీరు కలపడం తప్పు కాదు. ఇది రుచిని ఏమాత్రం తగ్గించదు. అయితే సరైన మొత్తంలో మాత్రమే నీరు కలపడం వల్ల దాని రుచి పెరుగుతుంది. మొదటి సిప్ విస్కీ చాలా ఘాటుగా, చేదుగా అనిపిస్తే, కొంచెం నీరు కలపవచ్చు. ఇంకా ఎక్కువ అనిపిస్తే, మరికాస్త నీరు పోసి సమపాళ్లలో వచ్చే వరకు రుచి చూస్తూ కలుపుకోవచ్చు. అలాగని విస్కీలో నీటిని ఎక్కువగా కలిపి పలుచన చేస్తే ప్రయోజనం ఉండదు. అందుకే జాగ్రత్తగా కొద్దికొద్దిగా నీరు కలపడం బెటర్.
ఇవి కూడా చదవండి
గుర్తుంచుకోండి విస్కీకి నీరు జోడించడం తప్పనిసరేంకాదు. ఇది వ్యక్తిగత ప్రాధాన్యత, స్వంత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. విస్కీలోని ఆల్కహాల్ కంటెంట్‌పై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అంతిమంగా మందుబాబులు విస్కీని తమకు నచ్చిన విధంగా ఆస్వాదించడానికి ఎలాంటి షరతులు లేవ్..!
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.
[