వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌.. పి.వి సింధు ఓటమి

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌.. పి.వి సింధు ఓటమి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం ముగిసింది. పారిస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు పరాజయం చవిచూసింది. ఇండోనేషియాకు చెందిన పికె వర్దానితో జరిగిన పోరులో సింధు పోరాడి ఓడింది. ఆసక్తికరంగా సాగిన మూడు సెట్ల సమరంలో వర్దాని 2114, 1321, 2116తో సింధును ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు సింధు అటు వర్దాని ప్రతి పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు పోరాడారు. తొలి సెట్‌లో వర్దాని విజయం సాధించింది. కానీ రెండో సెట్‌లో సింధు అద్భుత పోరాట పటిమతో ముందుకు సాగింది. ఆదే క్రమంలో సెట్‌ను కూడా దక్కించుకుంది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో సింధుకు ఓటమి తప్పలేదు.

Leave a Comment