– Advertisement –
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల కుటుంబాలను శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. పడగల్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మారుపెద్ద తిరుపతి వాళ్ళ మాతృమూర్తి కాలం చేయడంతో వారిని పరామర్శించారు. షెట్పల్లి సింగిల్ విండో చైర్మన్, దోన్కల్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి రాజేశ్వర్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పున్నం రెడ్డి తండ్రి ఇటీవల స్ట్రోక్ తో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జానకం పేట్ మాజీ సర్పంచ్ రమేష్ తండ్రి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
– Advertisement –