MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా రాజకీయాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు కలవడం రేపుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంతి రెడ్డిని చంపేస్తామంటూ రాసిన లేఖ కలకలం రేపింది. అంతటితో ఆగకుండా మరో ఎమ్మెల్యే హత్యకు కొందరు డ్రోన్లతో రెక్కీ నిర్వహించారన్న అంశం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు పన్నాగం పన్నుతున్నట్లు.. కొందరు మాట్లాడుతున్నట్లు వీడియో ఒకటి వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు రౌడీషీటర్ల సంభాషణ బయటపడింది. దీంతో ఇది సంచలన అంశంగా మారింది. పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించి.. అన్ని విషయాలు బయట పడతామని నెల్లూరు ఎస్పి ప్రకటించారు.
Also Read: రేవంత్ రెడ్డి ని కలిసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ… ఏంటి కథ..?
* వైసిపి నుంచి టీడీపీలోకి జంప్
మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీధర్ రెడ్డి. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత వీర విధేయత కలిగిన నాయకుడిగా మెలిగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆశించిన స్థాయిలో తనకు గుర్తింపు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. 16 నెలల పదవీకాలం ఉండగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ తీరును వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి ఓటు వేస్తారని కారణం చెబుతూ పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరి.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అభివృద్ధితోపాటు పార్టీ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యారు కూడా. ఈ క్రమంలోనే ఆయనపై హత్యా ప్రయత్నానికి సంబంధించిన వీడియో సంభాషణ బయటకు రావడం సంచలనంగా మారింది.
* ఓ 8 మంది హల్చల్..
దాదాపు ఓ ఎనిమిది మంది రౌడీ షీటర్లు ఒక దగ్గర మాట్లాడుకుంటున్నారు. మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటున్న మాటలు బయటకు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చితే మనకు డబ్బే డబ్బు అంటూ వారు మాట్లాడుకుంటున్నారు. ఆ వీడియోలో రౌడీ షీటర్లుగా గుర్తింపు పొందిన జగదీష్, మహేష్, వినీత్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఉన్న జగదీష్ అనే రౌడీషీటర్.. ఇటీవల వార్తల్లో నిలిచిన శ్రీకాంత్ ముఖ్య అనుచరుడని సమాచారం. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు ప్లాన్ వెనుక.. రౌడీ షీటర్ శ్రీకాంత్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ స్పందించారు. వీడియోను పరిశీలించామని.. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ల కలకలం రేగుతున్న నేపథ్యంలో.. ఈ వీడియో బయటకు రావడంపై రకరకాల చర్చ నడుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర
కోటంరెడ్డి హత్యకు కుట్ర పన్నిన రౌడీషీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ అరుణ?
పోలీసుల చేతికి చిక్కిన సంచలన వీడియో @kotamreddy_NLR @JaiTDP pic.twitter.com/yawc87gsvQ
— Swathi Reddy (@Swathireddytdp) August 29, 2025