Pawan Kalyan: సుగాలి ప్రీతి(Sugali Preethi)..కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి అప్పట్లో పెద్ద కలకలం రేపింది. స్కూల్ లో ఉరి వేసుకొని ఈమె అప్పట్లో చనిపోవడం, ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఆమెది సాధారణమైన అఘాయిత్యం కాదని, ఎవరో హత్య చేసి దానిని అఘాయిత్యం గా సృష్టించారని తెలిసింది. అప్పట్లో ఈ ఘటన పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఒక్కడే స్పందించాడు. సుగాలి ప్రీతి కి న్యాయం చేయాలంటూ కర్నూల్ కి వచ్చి లక్షలాది మందితో నిరసన ర్యాలీ కూడా నిర్వహించాడు. దీంతో జగన్ ప్రభుత్వం ఈ కేసు ని CID కి అప్పగించి విచారణ జరిగేలా ప్రయత్నం చేసింది కానీ, ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చింది, అయినప్పటికీ కూడా వీళ్లకు న్యాయం జరగలేదని, పవన్ కళ్యాణ్ అప్పట్లో ఈ అంశాన్ని రాజకీయానికి ఉపయోగించుకొని, ఇప్పుడు అధికారం లోకి రాగానే మర్చిపోయాడని వైసీపీ నేతలు చాలా రోజుల నుండి ఆయన్ని విమర్శిస్తూనే ఉన్నారు.
Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లిని తన క్యాంప్ ఆఫీస్ కి పిలిచి మాట్లాడాడు, న్యాయం జరిగేలా చూస్తామని చెప్పాడు, కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడం తో నిన్న సుగాలి ప్రీతి తల్లి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యింది. అధికారం లో లేనప్పుడు సుగాలి ప్రీతి కి న్యాయం జరగాలని లక్షలాది మందితో ర్యాలీలు చేసి, ఉద్యమించిన పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడని, మీ రాజకీయం కోసం నా బిడ్డ చావుని వాడుకున్నట్టుగా అనిపిస్తుందని, కనీసం ఇప్పుడైనా న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
నిన్న వైజాగ్ లో కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, సుగాలి ప్రీతి తల్లి చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ అసలు సుగాలి ప్రీతి కేసు ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు?, మేమే కదా. ఆ తల్లికి న్యాయం జరగాలని లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి, CBI దర్యాప్తు కి వెళ్లేలా చేసింది ఎవరు?, నేనే కదా?, అలాంటి నాపై ఇలా మాట్లాడడం భావ్యం కాదు. పవన్ కళ్యాణ్ అనే వాడు మెతక మనిషి అని నాపై అందరూ ఇలా తప్పులు తోసేస్తారు. గత ప్రభుత్వం మా పోరాటానికి దిగొచ్చి వాళ్లకు ఒక భూమి ఇచ్చింది, దాని విలువ ఇప్పుడు రెండు కోట్లు ఉంటుంది, వాళ్ళ కుటుంబం లో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దక్కాయి. కానీ మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు, అమ్మాయి శరీరం లో ఉన్న నిందితులకు సంబంధించిన వీర్యం DNA కి, వాళ్ళు చెప్పిన నిందితుల DNA తో మ్యాచ్ కావడం లేదు. కోర్టు సాక్ష్యాధారాలను మాత్రమే చూస్తుంది. ఆ సాక్ష్యాలను మార్చేశారు. దీంతో CBI ఈ కేసు ని పక్కన పెట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ పూర్తి వీడియో లో చూసి తెలుసుకోండి.