Maryada Manish Agnipariksha: ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ‘అగ్నిపరీక్ష'(Agnipareeksha) షో ఎంత ఉత్కంఠ నడుమ సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడమే లక్ష్యం. ఆన్లైన్ ద్వారా వచ్చిన లక్షల ధరఖాస్తులలో కేవలం 45 మందికి మాత్రమే ఆడిషన్స్ ని నిర్వహించి వారిలో 15 మందిని ఆడియన్స్ ఓటింగ్ లో పెట్టారు. ప్రస్తుతానికి ఓటింగ్ లో పడాల పవన్ కళ్యాణ్, షాకిబ్ టాప్ ఓటింగ్ తో ముందుకు దూసుకుపోతున్నారు. వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే మర్యాద మనీష్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. మొదటి రోజు ఓటింగ్ లో ఇతను టాప్ 5 లో ఉన్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన గ్రాఫ్ బాగా పడిపోయింది. నిన్నతో ఆయన అసలు రంగు కూడా బయటపడింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఆయన్ని తిట్టని వారంటూ ఎవ్వరూ లేరు.
Also Read: ఓడిపోయినోడ్ని ‘అగ్నిపరీక్ష’ కి జడ్జిగా పెడతారా..? నవదీప్ పై రెచ్చిపోయిన కౌశల్!
తనని తానూ చాలా తెలివి గల వాడికి ప్రొజెక్ట్ చేసుకునే మర్యాద మనీష్, నిన్న తన టీం సభ్యుల పై అహంకారం చూపిస్తూ చాలా అమర్యాదగా వ్యవహరించాడు. ఎందుకు అలా అతను ప్రవర్తించాడో తెలుసుకోవాలంటే, ముందు నిన్న ఎపిసోడ్ మొత్తం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ముందుగా శ్రీముఖి నిన్నటి ఎపిసోడ్ లో నిర్వహించబోయే టాస్కుల గురించి వివరిస్తూ ఈరోజు లక్ మరియు బుద్ధి బలం కి టెస్ట్ పెట్టబోతున్నామని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఒక రంగుల బాక్స్ లో వివిధ రకాల పండ్లని పెట్టి కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా తీసుకోమని చెప్పి, ఆ తర్వాత వాళ్ళందరిని లైన్ లో నిల్చోమని చెప్పారు. ఒకే రకమైన పండ్లని తీసుకున్న మనీష్, నాగ ప్రశాంత్ మరియు షాకిబ్ లను టీం లీడర్స్ గా ప్రకటించారు జడ్జిలు. ఆ తర్వాత ముగ్గురు జడ్జిల చేతుల్లో మూడు మూసివేసిన పోస్టులను ఇచ్చారు.
అందులో ఉన్న సంఖ్యల ఆధారంగానే ఎవరి టీమ్ లో ఎంత మంది ప్లేయర్స్ ఉండాలి అనేది నిర్ణయింపబడుతుంది. షాకిబ్ టీం లో ఇద్దరు, నాగ ప్రశాంత్ టీం లో నలుగురు, మర్యాద మనీష్ టీం లో 6 మంది వచ్చారు. ఇది తెలివి కి సంబంధించిన ప్రశ్నలు జడ్జిలు అడుగుతారు అన్నమాట. ఈ టాస్క్ లో నాగ ప్రశాంత్ టీం గెలుస్తుంది. ఆ తర్వాతి స్థానం లో షాకిబ్ టీం, చివరి స్థానం లో మనీష్ నిలుస్తుంది. మనీష్ తన టీం నుండి కేవలం స్వాతి ని మాత్రమే పంపించాడు. మిగిలిన అన్ని ప్రశ్నలకు ఆయనే ముందుకొచ్చాడు. కేవలం ఒక్క ప్రశ్న కి మాత్రమే సమాధానం చెప్పాడు. తన టీం లో తానే తెలివి వాడిని అనే అహంకారం చూపించాడు. టీం ఓడిపోయిన తర్వాత అతని టీం లోని పవన్ పైకి లేచి ప్రశ్నించినందుకు నీకు కండబలం తప్ప బుద్ధి బలం లేదు, కండబలం తో అవసరమైన ఫిజికల్ టాస్కుల్లోనే నువ్వు గెలవలేకపోయావు, ఇక బుద్ధి బలంతో ఆడే టాస్కులు ఆడలేవనే నేను పంపలేదు, ఇక కూర్చో అని చాలా పొగరుతో మాట్లాడుతాడు. ఇవన్నీ గమనించిన జడ్జిలు అతనికి వరస్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ ఇచ్చి, ఎల్లో కార్డు చేతిలో పెట్టారు. ఇంకొక్క ఎల్లో కార్డు వస్తే ఆయన షో నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి మర్యాద మనీష్ తప్పుకుంటాడా?, లేదా షో లోనే ఉంటాడా అనేది చూడాలి.