Patanjali University: పతంజలి యూనివర్సిటీ అందించే కోర్సుల ఫుల్‌ లిస్ట్ ఇదే.. ప్రాచీన విద్యలో ఆధునిక విద్య!

Written by RAJU

Published on:

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌లో యోగా గురువు స్వామి రాందేవ్ పతంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో.. పతంజలి యూనివర్సిటీ స్థాపించిన సంగతి తెలిసిందే. గత ఏడాది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు చెందిన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) ఈ యూనివర్సిటీకి A+ గ్రేడ్ ఇచ్చింది. పతంజలి యూనివర్సిటీ ఛాన్సలర్‌గా స్వామి రామ్‌దేవ్ కొనసాగుతున్నారు. అయితే 2025-26 విద్యాసంవత్సరానికి పతంజలి యూనివర్సిటీలో ఏయే కోర్సులు ఉంటాయి? ఇందులో ప్రవేశ ప్రక్రియ ఏమిటి? వంటి వివరాలు మీకోసం..

పతంజలి యోగా పీఠం.. పతంజలి యూనివర్సిటీతోపాటు ఆచార్య బాలకృష్ణ ఆయుర్వేద కళాశాల వంటి సంస్థలను కూడా స్థాపించింది. వీటిల్లో సాంప్రదాయ భారతీయ జ్ఞాన వ్యవస్థలను, ముఖ్యంగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడంపై కోర్సులు నిర్వహిస్తున్నాయి. అందుకే ఈ యూనివర్సిటీలో యోగా, ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ అంశాలపై దృష్టి సారించే వివిధ కోర్సులను అందిస్తుంది. ఇక ఆచార్య బాలకృష్ణ ఆయుర్వేద కళాశాలలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన కోర్సులు నిర్వహిస్తున్నారు.

పతంజలి యూనివర్సిటీ ఏయే కోర్సులు ఉన్నాయంటే..

  • BAMS (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ)
  • MD (డాక్టర్ ఆఫ్ మెడిసిన్)
  • PhD (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) వంటి వివిధ ఆయుర్వేద సంబంధిత కోర్సులు

ఇవి కూడా చదవండి

  • BSC (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) యోగా సైన్స్
  • MSC (మాస్టర్ ఆఫ్ సైన్స్) యోగా సైన్స్
  • PHd. యోగా సైన్స్ వంటి యోగా సైన్స్ సంబంధిత కోర్సులతోపాటు వేదాలు, తత్వశాస్త్రానికి సంబంధించిన కోర్సులు అందిస్తుంది
  • BA (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) వేదాలు, తత్వశాస్త్రం
  • MA (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్) వేదాలు, తత్వశాస్త్రం
  • PHd వేదాలు, తత్వశాస్త్రం
  • BA ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ
  • MA ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ
  • PhD ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ

ఈ వర్సిటీ ప్రాచీన సంప్రదాయాలను ఆధునిక విద్యతో ఎలా మిళితం చేస్తోందంటే..

పతంజలి యూనివర్సిటీ పురాతన సంప్రదాయాలను ఆధునిక విద్యతో మిళితం చేసే ప్రయత్నం చేస్తోంది. యోగా, ఆయుర్వేద విద్య ద్వారా.. యోగా, ఆయుర్వేదం వంటి ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి వివిధ కోర్సులను అందిస్తుంది. ఈ యూనివర్సిటీ పురాతన భారతీయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో కలపడంపై దృష్టి సారించిన అనేక పరిశోధన కార్యక్రమాలను తీసుకువస్తుంది. విద్యార్థులు పురాతన జ్ఞానాన్ని ఆధునిక పద్ధతిలో నేర్చుకోవడంలో సహాయపడటానికి.. ఆన్‌లైన్ విద్య, ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి ఆధునిక విద్యా పద్ధతులను కూడా అవలంబిస్తుంది.

భారతీయ విద్యను ఎందుకు పునరుజ్జీవింపజేస్తోందంటే..

పతంజలి గురుకులం సాంప్రదాయ భారతీయ జ్ఞానం, విలువలను కాపాడటానికి, వాటిని కొత్త తరాలకు అందించడానికి కృషి చేస్తుంది. ఆధునిక విద్యా వ్యవస్థకు అనేక పరిమితులు ఉన్నాయి. వాటిలో బట్టీ పట్టే ధోరణి, ఆచరణాత్మక జ్ఞానం లేకపోవడం వంటివి ఉన్నాయి. ఈ పరిమితులను అధిగమించడానికి పతంజలి గురుకులం సాంప్రదాయ విద్యా పద్ధతులను అవలంబిస్తుంది. గురుకులం భారతీయ సంస్కృతి, మతం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని.. విలువలను విద్యలో చేర్చడానికి కృషి చేస్తుంది. పతంజలి యూనివర్సిటీ.. విద్యార్థులు పురాతన జ్ఞానాన్ని ఆచరణాత్మక మార్గంలో అన్వయించడంలో సహాయపడటానికి ప్రోత్సహిస్తుంది.

పతంజలిలోని ఆయుర్వేద విద్య

పతంజలి ఆయుర్వేదం విద్యలో సాంప్రదాయ ఆయుర్వేద జ్ఞానాన్ని పరిరక్షించడంపై దృష్టి పెడుతుంది. పతంజలి ఆయుర్వేద విద్యలో కూడా ఆన్‌లైన్ విద్య, ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ల వంటి ఆధునిక విద్యా పద్ధతులు ఉన్నాయి. పతంజలి ఆయుర్వేద విద్య ఆచరణాత్మక శిక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. విద్యార్థులకు ఆయుర్వేద వైద్యం, చికిత్సల గురించి ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తుంది. పతంజలి ఆయుర్వేద బోధనలు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని విలువైనదిగా భావించి, సమగ్ర ఆరోగ్య విధానాన్ని నొక్కి చెబుతాయి.

పతంజలి విద్యా విధానంతో జాతీయ అభివృద్ధి

పతంజలి విద్యా విధానం జాతీయ అభివృద్ధికి ఒక బ్లూప్రింట్ లాంటిది. ఎందుకంటే ఇది సాంప్రదాయ భారతీయ విలువలు, జ్ఞానాన్ని ఆధునిక విద్యా పద్ధతులతో మిళితం చేస్తుంది. విద్యార్థులకు సమగ్ర విద్యను అందిస్తుంది. జాతీయ అభివృద్ధికి దోహదపడేలా వారిని సిద్ధం చేస్తుంది. పతంజలి విద్య విధానం సమగ్ర విద్యను నొక్కి చెబుతుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాముఖ్యతను ఇస్తుంది. పతంజలి విద్య విధానం సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. విద్యార్థులు సమాజం, సంస్కృతి అభివృద్ధికి దోహదడేలా సహాయపడుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification