
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరో 7 నెలలు కంటిన్యూ అవనుంది. రామకృష్ణారావు పదవీకాలం పొడిగిస్తూ నేడు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 2026 మార్చి వరకు సీఎస్ గా కొనసాగనున్నారు. కాగా 2025 మే లో ఆయనను తెలంగాణ సీఎస్ గా ప్రభుత్వం సిఫారసు చేయగా.. కేంద్రం ఆమోదించింది. అయితే ఆయన పదవీకాలం ఈనెల 31తో ముగియనుండగా… మరి కొంతకాలం పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాయగా.. నేడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మరో 7 నెలలు రామకృష్ణారావు పదవిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.