సూపర్‌ సింధు!

వరల్డ్‌ నం.2పై గెలుపు

పారిస్‌ (ఫ్రాన్స్‌) : అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు అదరగొట్టింది. వరల్డ్‌ నం.2 వాంగ్‌ జి యి (చైనా)పై 21-19, 21-15తో మెరుపు విజయం సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 48 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో పి.వి సింధు గొప్పగా రాణించింది. వాంగ్‌ జి తొలి గేమ్‌లో ప్రతిఘటించినా.. రెండో గేమ్‌లో సింధు తిరుగులేని ఆధిపత్యం చూపించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టో జోడీవరల్డ్‌ నం.5 జోడీ టాంగ్‌, యింగ్‌ (హాంగ్‌కాంగ్‌)లను 19-21, 21-12, 21-15తో చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు.

The post సూపర్‌ సింధు! appeared first on Navatelangana.

Leave a Comment