దోమ కాటుతో హెచ్‌ఐవీ వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..? – Telugu News | Can Mosquito Bites Spread HIV And What Science Says

నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. దోమలు హెచ్‌ఐవీ వైరస్‌ను ఒకరి నుండి మరొకరికి చేరవేయలేవు. ఎందుకంటే దోమ ఒకరిని కుట్టినప్పుడు వారి రక్తాన్ని మాత్రమే తాగుతుంది. కానీ ఆ రక్తాన్ని మరొకరికి ఎక్కించదు. మరో విధంగా చెప్పాలంటే.. దోమ సిరంజ్ (syring) లా పని చేయదు.

ఒకవేళ దోమకు హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తి రక్తం అంటినా.. అది మరొకరిని కుట్టినప్పుడు ఆ వైరస్‌ను లోపలికి పంపలేదు. ఎందుకంటే దోమ మనల్ని కుట్టినప్పుడు అది రక్తాన్ని కాకుండా దాని ఉమ్మిని మాత్రమే చర్మంలోకి విడుదల చేస్తుంది.

హెచ్‌ఐవీ ఎలా వ్యాపిస్తుంది..?

హెచ్‌ఐవీ అనేది కేవలం కొన్ని శరీర ద్రవాల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. అయితే ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుని.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే దానిని కంట్రోల్ చేయొచ్చు.

  • సేఫ్‌టీ లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం. దీని వల్ల వీర్యం లేదా యోని ద్రవాల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది.
  • ఒక వ్యక్తి నుంచి మరొకరికి రక్తం ఎక్కించేటప్పుడు (blood transfusion).
  • హెచ్‌ఐవీ ఉన్న తల్లి నుంచి బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు.
  • గాయాలు లేదా కోసుకుపోయిన చోట నుంచి రక్తం మరొకరికి సోకినప్పుడు.

అయితే డాక్టర్ల సలహాలు పాటిస్తే.. హెచ్‌ఐవీ ఉన్న తల్లులు కూడా తమ పిల్లలకు వైరస్ సోకకుండా పుట్టేలా చేయవచ్చు. ఇది చాలా మందికి తెలియని విషయం.

హెచ్‌ఐవీ నుండి రక్షణ 

  • సేఫ్ సెక్స్ చేయండి. ఎప్పుడూ రక్షణ ఉపయోగించండి.
  • హెచ్‌ఐవీ ఉన్నవారి శరీర ద్రవాలతో డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా జాగ్రత్త పడండి.
  • హెల్తీ లైఫ్‌స్టైల్ ఫాలో అయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

[

Leave a Comment