India Post Gramin Dak Sevak GDS Recruitment 2025: భారత తపాలా శాఖ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..
హైలైట్:
- ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2025
- మొత్తం 21,413 ఖాళీలు భర్తీకి ప్రకటన
- మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తులకు ఛాన్స్

1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)
- పోస్టుల సంఖ్య: సర్కిల్ వారీగా అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
- విద్యార్హత: గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- వయోపరిమితి: 18 నుండి 40 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది).
ఉద్యోగ బాధ్యతలు:
- బ్రాంచ్ పోస్టాఫీసులో రోజువారీ పోస్టల్ కార్యకలాపాలను నిర్వహించడం.
- ఇండియా పోస్ట్, IPPB సేవల మార్కెటింగ్ మరియు ప్రచారం.
- మెయిల్ రవాణా, డెలివరీని నిర్వహించడం.
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)
- పోస్టుల సంఖ్య: సర్కిల్ వారీగా అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
- విద్యార్హత: గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- వయోపరిమితి: 18 నుండి 40 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది).
ఉద్యోగ బాధ్యతలు:
- వివిధ పోస్టల్, ఆర్థిక కార్యకలాపాల్లో BPMకి సహాయం చేయడం.
- మెయిల్ మరియు IPPB లావాదేవీల డోర్ స్టెప్ డెలివరీ.
- స్టాంపులు, స్టేషనరీ మరియు ఇతర పోస్టల్ సేవలను సేల్ చేయండి.
- పోస్టల్ ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం చేయడం.
3. డాక్ సేవక్
- పోస్టుల సంఖ్య: సర్కిల్ వారీగా అధికారిక వెబ్‌సైటల్ చెక్ చేసుకోవచ్చు.
- విద్యార్హత: గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటుంది.
- వయోపరిమితి: 18 నుండి 40 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది).
ఉద్యోగ బాధ్యతలు:
- మెయిల్ మరియు పార్శిల్స్ డెలివరీ చేయడం.
- IPPB డిపాజిట్లు, విత్‌డ్రా, ఇతర లావాదేవీలను నిర్వహించడం.
- పోస్టాఫీసు కార్యకలాపాల్లో సహాయం చేయడం.
- కేటాయించిన పోస్టాఫీసు పరిధిలో నివసించాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఫిబ్రవరి 10, 2025
- దరఖాస్తులకు చివరితేది: మార్చి 3, 3035
- దరఖాస్తు సవరణ తేదీలు : మార్చి 6 నుంచి 8 వరకు.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు https://indiapostgdsonline.cept.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు సమర్పణకు ముందు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం.
- అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసిన కాపీలను మాత్రమే అప్‌లోడ్ చేయాలి.
- 06.03.2025 నుండి 08.03.2025 వరకు తప్పులు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఖచ్చితమైన వివరాలను నిర్ధారించుకోవాలి.