NTPC Jobs 2025 : ఎన్టీపీసీ సంస్థ భారీ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- ఎన్‌టీపీసీ జాబ్ రిక్రూట్‌మెంట్ 2025
- 400 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
- మార్చి 1 దరఖాస్తులకు చివరితేది

NTPC ముఖ్యమైన సమాచారం :
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 400
- అర్హత: 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- జీతం: నెలకు రూ.55,000 వరకు ఉంటుంది.
- వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్ వారికి 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది).
- దరఖాస్తు ఫీజు: రూ.300గా నిర్ణయించారు. (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు).
- ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: ఫిబ్రవరి 15, 2025
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 1, 2025
బీహెచ్‌ఈఎల్ సంస్థలో 400 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అర్హత
BHEL Trainee Recruitment 2025 : భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) సంస్థ ఇంజినీర్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 28 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.