Mirai Trailer Highlights: ‘మిరాయ్’ ట్రైలర్ లో శ్రీరాముడిగా కనిపించిన స్టార్ హీరో అతనేనా..?

Mirai Trailer Highlights: ఈమధ్య కాలం లో దేవుళ్ళ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా విడుదలైన ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha) అనే యానిమేషన్ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచనలనం సృష్టించింది. ఇప్పుడు అదే కోవలోకి తేజ సజ్జ(Teja Sajja) నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం కూడా నిలుస్తుందట. సెప్టెంబర్ 12 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఇది కూడా దేవుడి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా. క్వాలిటీ చూస్తుంటే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ని ఖర్చు చేసినట్టుగా మనకి అనిపిస్తుంది కానీ, మీడియం బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారట.

విజువల్స్, గ్రాఫిక్స్ చూస్తే ఆ రేంజ్ లో ఉన్నాయి, మరి మీడియం రేంజ్ బడ్జెట్ ఖర్చు అయ్యిందని ఎలా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ట్రైలర్ లో మనం చూసిన విజువల్స్ లోని లొకేషన్స్ మొత్తం నిజమైన లొకేషన్స్ వద్దకు వెళ్లే తెరకెక్కించారట. దాని వల్ల బోలెడంత బడ్జెట్ సేవ్ అయ్యిందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ లోని కొన్ని షాట్స్ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసింది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో శ్రీ రాముడి క్యారక్టర్ బాగా హైలైట్ అయ్యింది. ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ గా నిల్చింది. ఆయన యుగం లోని ఆయుధం కోసమే హీరో ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణం మధ్యలో హీరో కి ఎదురయ్యే అనుభవాలే సినిమా ప్రధాన కథాంశం అని తెలుస్తుంది. అది కాసేపు పక్కన పెడితే ఇంతకీ ఈ ట్రైలర్ లో శ్రీరాముడిగా కనిపించిన ఆ నటుడు ఎవరు?.

ఈ సందేహం ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరిలో కలగడం సహజం. ప్రస్తుతం తరంలో శ్రీ రాముడి క్యారక్టర్ అంటే మహేష్ బాబు(Super Star Mahesh Babu) మాత్రమే చేయగలడు, ఈ సినిమాలో మహేష్ బాబే నటించి ఉంటాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. శ్రీ రాముడి క్యారక్టర్ ని AI ఉపయోగించి డిజైన్ చేశారట. అందుకే సహత్వానికి చాలా దగ్గరగా ఆ గెటప్ ఉంది. ట్రైలర్ లో శ్రీరాముడి ముఖాన్ని పూర్తిగా చూపించకుండా కవర్ చేయడం కూడా ఇప్పుడు ఆడియన్స్ లో క్యూరియాసిటీ ని పెంచింది. AI అని తెలిసిన వాళ్లకు పెద్ద సర్ప్రైజ్ ఉండకపోవచ్చు కానీ, మామూలు ఆడియన్స్ లో మాత్రం ఆ క్యారెక్టర్ ఎవరు చేసి ఉంటారా అనే క్యూరియాసిటీ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్యూరియాసిటీ సినిమా పై మరింత అంచనాలు పెంచేలా ఉంది అనొచ్చు.

Leave a Comment