BOB Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 518 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమై కొనసాగుతోంది. వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2025
- 518 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- మార్చి 11 దరఖాస్తులకు చివరితేది

భర్తీ చేయనున్న పోస్టులు :
సీనియర్ మేనేజర్, మేనేజర్- డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీస్- డెవలపర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్- క్లౌడ్ ఇంజినీర్, ఆఫీసర్- ఏఐ ఇంజినీర్, మేనేజర్- ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్- నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఇతర ముఖ్యమైన సమాచారం :
- మొత్తం ఖాళీల సంఖ్య: 518
- అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: పోస్ట్ గ్రేడ్- ఎంఎంజీ/ ఎస్-3 పోస్టులకు 27 నుంచి 37 ఏళ్లు, ఎంఎంజీ/ ఎస్-2 పోస్టులకు 24 నుంచి 34 ఏళ్లు, జేఎంజీ/ ఎస్-1 పోస్టులకు 22 నుంచి 32 ఏళ్లు, ఎస్ఎంజీ/ ఎస్-4 పోస్టులకు 33 నుంచి 43 ఏళ్లు ఉండాలి.
- జీతం: నెలకు పోస్ట్ గ్రేడ్- జేఎంజీ/ ఎస్-1 పోస్టులకు రూ.48,480, ఎంఎంజీ/ ఎస్-2 పోస్టులకు రూ.64,820, ఎంఎంజీ/ ఎస్-3 పోస్టులకు రూ.85,920, ఎస్ఎంజీ/ ఎస్-4 పోస్టులకు రూ.1,02,300 ఉంటుంది.
- దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11, 2025