ఉత్తరాదిని వర్షాలు ముచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లోని లోతట్టు ప్రాంతాలు మొత్తం నీటి మునిగాయి. నదులు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తాన్నాయి. ఈ క్రమంలోనే బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం మనాలిలోని రైసన్ టోల్ ప్లాజాను ముంచెత్తింది. వరద ఉధృతికి టోల్ ప్లాజా నీట మునగడంతో పాటు, చాలా ప్రాంతాల్లో రోడ్డు కూడా కొట్టుకుపోయింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న నివాసాలు మొత్తం నీటమునిగాయి. పురాతన భయనాలు నేలకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Beas is collecting the toll now, the river is claiming back its land. Visuals from Raison toll near Manali where the road is gone and the Beas now flows through the toll plaza. Sun is out today but rains are expected to be back soon. pic.twitter.com/xXgdH28o5C
— Nikhil saini (@iNikhilsaini) August 27, 2025
అయితే మనాలి టోల్ ప్లాజా నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ వీడియో కొన్న వాహనాలు నీటిలో చిక్కుకుపోవడం కూడా మన చూడవచ్చు. కాగా సోమవారం సాయంత్రం నుండి రాష్ట్రంలో 12 ఆకస్మిక వరదలు, రెండు పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఈ సంఘటనలలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
देखिए हिमाचल की पर्यटन नगरी मनाली में ब्यास नदी ने किस कदर तबाही मचाई। फ़ोरलेन हाईवे साफ़ हो चुका है और नदी अभी भी उफान से पर है। #HimachalPradesh pic.twitter.com/Ev4Wu9UmC0
— thehillnews.in (@thehill_news) August 26, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.