Sir Don Bradman Birthday: క్రికెట్లో బౌలర్ల పాలిట అత్యంత డేంజరస్ బ్యాటర్‌ను ఎప్పుడైనా చేశారా.. సఅలు ఎలా ఉంటాడో తెలుసా, బరిలోకి దిగితే బంతితోపాటు బౌలర్ పరిస్థితి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిందే. అలాంటి ఓ దిగ్గజ ప్లేయర్ ఆస్ట్రేలియన్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మాన్ ఇన్నింగ్స్ గురించి తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఓ ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌మాన్ కేవలం 3 ఓవర్లలోనే తన సెంచరీని పూర్తి చేశాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఆ తర్వాత, బ్రాడ్‌మాన్ బ్యాట్ మరింత పవర్‌తో తిరిగొచ్చింది. కేవలం 3 ఓవర్లలో సెంచరీ చేసిన బ్రాడ్‌మాన్ మొత్తం మ్యాచ్‌లో 256 పరుగులు చేశాడు. ఇప్పుడు మనం అకస్మాత్తుగా సర్ డాన్ బ్రాడ్‌మాన్, అతని ఇన్నింగ్స్ గురించి ఎందుకు ప్రస్తావించామని ప్రశ్న కలగవచ్చు. అందుకు ఓ కారణం ఉంది. ఆగస్టు 27 1908లో జన్మించిన బ్రాడ్‌మాన్ పుట్టినరోజు 117వ వార్షికోత్సవం.
14 సిక్సర్లు, 29 ఫోర్లు.. 256 పరుగులతో బ్రాడ్‌మాన్ బీభత్సం..
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సర్ డాన్ బ్రాడ్‌మాన్ తన సెంచరీని ఎప్పుడు, ఏ జట్టుపై 3 ఓవర్లలో పూర్తి చేశాడు? కాబట్టి, బ్రాడ్‌మాన్ బ్యాట్ నుంచి ఆ తుఫాన్ 1931 సంవత్సరంలో కనిపించింది. అంటే టీ20 క్రికెట్ జాడ లేనప్పుడు. అంటే, క్రికెట్లో ఆ సమయంలో ఒక ఓవర్ 8 బంతులు ఉండేవి. అప్పుడు బ్రాడ్‌మాన్ ప్రపంచానికి తుఫాన్ బ్యాటింగ్‌ను పరిచయం చేశాడు.
బ్లాక్‌హీత్ XI వర్సెస్ లిత్గో XI మధ్య జరిగిన మ్యాచ్‌లో, బ్రాడ్‌మాన్ బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఓడించాడు. ఆ మ్యాచ్‌లో అతను బ్లాక్‌హీత్ జట్టులో ఒకడిగా బరిలోకి దిగాడు. మొదట బ్యాటింగ్ చేసిన బ్లాక్ హీత్ జట్టు 357 పరుగులు చేసింది. ఇందులో 256 పరుగులు బ్రాడ్‌మాన్ ఒక్కడే చేయడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌మాన్ 14 సిక్సర్లు, 29 ఫోర్లు బాదాడు. అనంతరం లిత్గో XI 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 228 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను 129 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇవి కూడా చదవండి
3 ఓవర్లలో సెంచరీ ఎలా సాధించాడంటే..
బ్రాడ్‌మాన్ కేవలం 22 బంతుల్లోనే అంటే 3 ఓవర్లలోపే తన సెంచరీని పూర్తి చేశాడు. మొదటి ఓవర్లో 33 పరుగులు, రెండవ ఓవర్లో 40 పరుగులు, మూడవ ఓవర్లో 27 పరుగులు చేయడం ద్వారా అతను ఈ ఘనతను సాధించాడు. బ్రాడ్‌మాన్ మొదటి ఓవర్లో ఒకసారి 2 పరుగులు, ఒక సింగిల్ తీసుకున్నాడు. అంతేకాకుండా 3 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత, అతను రెండవ ఓవర్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టాడు. మూడవ ఓవర్లో, అతను 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టడంతో పాటు ఒక సింగిల్ తీసుకున్నాడు.
1వ ఓవర్: (బౌలర్-విల్ బ్లాక్) 6, 6, 4, 2, 4, 4, 6, 1: మొత్తం 33 పరుగులు
2వ ఓవర్: (బౌలర్- హారీ బేకర్) 6, 4, 4, 6, 6, 4, 6, 4: మొత్తం 40 పరుగులు
3వ ఓవర్: (బౌలర్-విల్ బ్లాక్) 6, 6, 1, 4, 4, 6: మొత్తం 27 పరుగులు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..