Trains Cancelled: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. తెలంగాణ వ్యాప్తంగా పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు! – Telugu News | South Central Railway cancels several trains due to heavy rains in Telangana

తెలంగాణ వ్యాప్తంగా గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యారు. వాగులు వంకలు పొంగి పోర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై భారీగా వరద నీరు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

రద్దైన ట్రైన్స్‌ వివరాలు

బుధవారం రద్దైన రైలు: కరీంనగర్‌-కాచిగూడ, కాచిగూడ – నిజామాబాద్(77643) మెదక్ – కాచిగూడ(57302) కాచిగూడ – మెదక్ (77603) , ఆదిలాబాద్ – తిరుపతి (17406)

గురువారం రద్దైన రైలు: మెదక్ – కాచిగూడ (77604), బోధన్ – కాచిగూడ (57414), నిజామాబాద్ – కాచిగూడ(77644) సర్వీసును రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

మహబూబ్‌నగర్‌ – కాచిగూడ, షాద్‌నగర్‌-కాచిగూడ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలిపిన అధికారులు.

మరోవైపు కామారెడ్డి – బికనూర్ – తలమడ్ల, అకన్పేట్ – మెదక్ రైల్వే ట్రాక్‌ పై నుంచి భారీగా వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రైళ్ల రద్దు, దారి మళ్లింపు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

దారి మళ్లించిన రైళ్ళ వివరాలు

  • 17663 నెంబర్‌ గల రాయచూర్-పర్బాని ఎక్స్‌ప్రెస్ : వికారాబాద్- పర్లి వైజ్యనాథ్- పూర్ణ మీదుగా దారి మళ్లింపు.
  • 17664 నెంబర్ గల నాందేడ్ -రాయచూర్ ఎక్స్‌ప్రెస్ : నాందేడ్- పూర్ణ- పర్లి వైజ్యనాథ్- వికారాబాద్ మీదుగా దారి మళ్లింపు
  • 17063 నెంబర్‌ గల మన్మాడ్ -కాచిగూడ (అజంతా ఎక్స్ ప్రెస్) పర్బాని- పర్లి వైజ్యనాథ్-వికారాబాద్- సికింద్రాబాద్ మీదుగా మళ్లింపు
  • 07054 నెంబర్ గల బికనీర్ -కాచిగూడ ఎక్స్‌ప్రెస్ : పూర్ణ- పర్బాని-పర్లి వైజ్యనాథ్-వికారాబాద్- సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లింపు
  • 17019 నెంబర్‌ గల హిసార్ -హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్: పర్బాని-పర్లి వైజ్యనాథ్- వికారాబాద్-హుస్సేన్ సాగర్ జంక్షన్-హైదరాబాద్ దక్కన్ మీదుగా మళ్లింపు

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment