ఘనంగా మదర్ థెరిస్సా 116 వ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర – కడియం : పేదలకు, వ్యాధిగ్రస్తులకూ, అనాథలకూ పరిచర్యలు చేసిన గొప్ప వ్యక్తి మదర్ థెరిస్సా అని ఇ నవీన్ అన్నారు. కడియం మండలం, పొట్టిలంక గ్రామం, లూథరన్ ఛర్చ్ ఆవరణలో, మదర్ థెరిస్సా సేవా సంఘం ఆధ్వర్యంలో, మదర్ థెరిస్సా 116 వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నవీన్ మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అల్బెనియా దేశానికి చెందిన మదర్ థెరిస్సా భారతదేశ పౌరసత్వం తీసుకుని, మిషనరీస్ ఆఫ్ చారిటి సంస్థను స్థాపించి, ఆమె చేసిన మానవ సేవలను కొనియాడారు. కులమతాలకు అతీతంగా అత్యుత్తమ సేవలందించిందని, నోబెల్ శాంతి బహుమతి భారతరత్న అవార్డులు అందుకున్నదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిస్సా సేవా సంఘం అధ్యక్షుడు నక్కా వెంకటరత్నరాజు, కార్యదర్శి అర్థాల కుమార్ బాబు, న్యాయవాది బడుగు సత్తిబాబు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నక్కా చంటిబాబు, కొల్లపు వీరన్న, కొండేపూడి చిన్ని, నక్కా ఆనందకుమార్, గుమ్మడి అర్జున్, బడుగు గణేష్, నక్క బాబీ, బడుగు వెంకీ, దాసి రాజు, యాళ్ల సురేష్, నెల్లి తేజ, నక్క రాజు, నెరిమెల్లి ప్రవీణ్ కుమార్, బడుగు రూపీలియ్య, నక్క అనుబాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment